పెళ్లి చూపులు ఇష్టం లేక.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. | Young Woman Deceased In Kurnool district | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులు ఇష్టం లేక.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

Jan 18 2022 9:33 AM | Updated on Jan 18 2022 9:38 AM

Young Woman Deceased In Kurnool district - Sakshi

వైష్ణవి(ఫైల్‌)

పెళ్లి చూపులు ఇష్టం లేక ఓ యువతి సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): పెళ్లి చూపులు ఇష్టం లేక ఓ యువతి సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..కొలిమిగుండ్లకు చెందిన కొప్పురపు శ్రీనివాసులు, భారతి దంపతుల కుమార్తె వైష్ణవి(26) అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్యం పల్లె గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.

చదవండి: ఆనందపడ్డారు.. కానీ పోలీసులు వదల్లేదు..

అనారోగ్య కారణంతో ఈనెల 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు సెలవు పెట్టుకొని ఇంటి వద్దే ఉంటోంది. పెళ్లి చూపులు చూసేందుకు రెండు మూడు రోజుల్లో వస్తున్నారని కుమార్తెకు తల్లిదండ్రులు చెప్పారు. పెళ్లి చూపులు ఇష్టం లేని వైష్ణవి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథరెడ్డి చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement