చనిపోయిన వారి రిటర్నులు ఎలా వేయాలంటే.. | Income Tax Rules: How to File ITR for Deceased Person Legal Heir | Sakshi
Sakshi News home page

IT Returns: చనిపోయిన వారి రిటర్నులు ఎలా వేయాలంటే..

Jul 20 2026 10:19 AM | Updated on Jul 20 2026 10:28 AM

Income Tax Rules: How to File ITR for Deceased Person Legal Heir

కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, దగ్గరవాళ్లు చనిపోతే వారి తరఫున వారసులు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. దాఖలు చేయాల్సిన బాధ్యత కేవలం వారసులపైనే ఉంటుంది. చాలా మంది ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. రిటర్ను వేయాలా, మానేయాలా? పన్ను చెల్లించాలా .. రిఫండు కోసం ఏం చేయాలి .. పాన్‌ని సరెండర్‌ చేయాలా .. ఆదాయపు పన్ను శాఖ వారికి ఎలా తెలియజేయాలి .. రిటర్ను వేస్తే ఎలా వేయాలి.. మొదలైన విషయాలు ఈ వారం తెలుసుకుందాం.

  •     మీరు ప్రత్యేకంగా డిపార్టుమెంటు వారికి తెలియజేయాల్సిన అవసరం లేదు. అలాగే ’పాన్‌’ సరెండర్‌ చేయనవసరం లేదు. కానీ, ఆ పాన్‌ని వాడకండి. దుర్వినియోగం చేయకండి. అధికార ప్రత్యుత్తరాలలో తప్ప ఎక్కడా ఆ నంబరును ’కోట్‌’ చేయకండి.

  •     అన్ని డాక్యుమెంట్లు.. అంటే.. డెత్‌ సర్టిఫికెట్లు, పోయినవారి పాన్‌ కార్డు, పాత సంవత్సరాల రిటర్నులు, బ్యాంకు పాస్‌బుక్‌లు, క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు, వారి ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్‌ మొదలైన కాగితాలను భద్రపరచండి.

  •     వారసులు ఒకరే ఉంటే సరే సరి. ఇద్దరు, లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే అందరూ కలిసి ఒకరినే ఎంచుకోండి. మనస్పర్థలు, గొడవలు అనవసరం. కేవలం ఒకరే 
    ముందుకు రండి.

  •     అలా ముందుకు వచ్చిన వారు, లేదా అందరూ కలిసి ఎంచుకున్న వారు..అన్ని కాగితాలతో రెడీగా ఉండండి. కాగితాల ప్రకారం వారసత్వం సరి్టఫికెట్లో మీ పేరు స్పష్టంగా ఉండాలి. తప్పులు ఉండకూడదు. (ఈ సరి్టఫికెట్‌ ఎలా తెచ్చుకోవాలో ఈ కాలమ్‌లో ప్రస్తావించడం లేదు).

  •     మీ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్‌ ప్రూఫ్, మీకున్న సంబంధం – చుట్టరికం, వీటన్నింటితో పాటు మరణించిన వారి డెత్‌ సరి్టఫికెట్, అన్నీ పెట్టి, వారసత్వపు సరి్టఫికెట్‌తో పాటు, ఐటీ పోర్టల్‌లో లాగిన్‌ అయి మిమ్మల్ని మీరు ’రిప్రజెంటేటివ్‌ అసెసీ’గా నమోదు చేసుకోండి.

  •     నమోదు ప్రక్రియలో భాగంగా అన్ని కాగితాలు సబ్మిట్‌ చేశాక, డిపార్టుమెంటు వారి నుంచి ముందస్తు అనుమతి అవసరం. వాళ్లు చాలా త్వరగా మిమ్మల్ని ’గుర్తిస్తారు’.  

  •     అలా గుర్తింపు పొందాకా..ఇక మిగతాదంతా షరా మామూలే. పాత పాటే. ఆ సంవత్సరం మొదటి నుంచి, ఏ తేదీనాడు ఆ బంధువు పోయారో, ఆ తేదీ వరకు ఆ వ్యక్తికి సంబంధించిన ఆదాయమే రిటర్నుల్లో వేయాలి. ఏ రకమైన ఆదాయమైనా, ఆ తేదీ వరకే లెక్కించాలి.

  •     ఒకవేళ అప్పటికే టీడీఎస్‌ ఉంటే, ఆ ఆదాయం మీద పన్నుభారం లెక్కించి పన్ను భారం చెల్లించాలి. టీడీఎస్‌ మిగిలితే రిఫండు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

  •     ఆ తేదీ తరువాతవి, వారసుల అకౌంటులోకి వస్తాయి. వాటితో పాటు మీ సొంత ఆదాయం కలిపి మీరు రిటర్ను దాఖలు చేయాలి.

  •     ఎలాగూ చనిపోయిన వారి అకౌంట్‌ క్లోజ్‌ అయిపోతుంది కాబట్టి, వారసుల బ్యాంకు అకౌంటు వివరాలు పొందుపరచవచ్చు.

  •     వారసులు అన్ని జాగ్రత్తలు తీసుకుని రిటర్ను దాఖలు చేయండి. కరెక్ట్‌ ఫారంను 
    ఎంచుకోండి.

  •     రిఫండు పెద్ద మొత్తం ఉన్నా.. లేక పన్ను భారం ఎక్కువగా అనిపించినా .. వృత్తి నిపుణుల సహాయ సహకారాలు తీసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement