కోచింగ్ సెంటర్‌ యజమానిపై కన్నేసిన ప్రొఫెసర్‌.. ఇంటికి ఆహ్వనించి

Udaipur: Man Rapes Mumbai Woman After Spiking Her Drink Arrested - Sakshi

జైపూర్‌: ఉదయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వనించి.. మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. కాగా,  బాధిత యువతి, స్థానిక  పోలీసులకు  ఫిర్యాదు చేసింది. దీంతో, తాజాగా (సోమవారం) జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన బాధిత మహిళ స్థానికంగా ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కోచింగ్‌ సెంటర్‌ను నడుపుతుంది. దీంట్లో ఎందరో విద్యార్థులు కోచింగ్‌ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో.. నీరజ్‌కుమార్‌ అనే వ్యక్తి.. సదరు ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను తీసుకునేవాడు.కాగా, ఇతను ఉదయ్‌పూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేసేవాడు. అయితే, కోచింగ్‌ సెంటర్‌ లో క్లాసులు తీసుకోవడం వలన వీరిద్దరికి కొంత పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా నీరజ్‌ .. కోచింగ్‌ సెంటర్‌ యజమానిపై కన్నేశాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను లోంగదీసుకోవాలనుకున్నాడు. అదును కోసం చూడసాగాడు. దీంట్లో భాగంగానే ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు.  ఆ యువతిని ఉదయ్‌పూర్‌లోని తన ఇంటికి రావల్సిందిగా ఆహ్వనించాడు. అయితే, బాధిత యువతి తెలిసినవాడే కదా.. అని ఉదయ్‌పూర్‌ వెళ్లింది. 

కానీ, ప్రొఫెసర్‌ మనసులో ఉన్న దుర్భుద్ధిని మాత్రం గుర్తించలేకపోయింది. ఈ క్రమంలో అతగాడు..యువతి.. ఉదయ్‌పూర్‌ వచ్చాక ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత , ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చాడు. దాని ప్రభావంతో ఆమె మత్తులోకి జారుకుంది. దీంతో.. అతగాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి మత్తు నుంచి తేరుకున్నాక.. సదరు యువతి ఆందోళనకు లోనైంది. వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నీరజ్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న గోడుండా పోలీసులు నీరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలుసెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top