హైదరాబాద్‌: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం | Two Deceased In Road Accident At Ranga Reddy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

Nov 13 2020 6:26 AM | Updated on Nov 13 2020 10:21 AM

Two Deceased In Road Accident At Ranga Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ వద్ద సాగర్ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైద్రాబాద్ నుంచి వేగంగా ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న టాటా సఫారీ కారు AP29BD7111 యమహా ఫాసినో TS07GA2600ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యమహా ఫాసినోపై ఉన్న తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు రాగన్నగూడలోని జీవీఆర్ కాలనీలో నివాసముండే సంరెడ్డి ప్రదీప్ రెడ్డి(19), సంరెడ్డి చంద్రకళ(48)గా పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement