‘సాయి ఆదుకున్నాడు, దేవ ముంచాడు’ | TV Actress Sravani Mother Alleges Devaraju Cheats Her Daughter | Sakshi
Sakshi News home page

‘సాయి ఆదుకున్నాడు, దేవ ముంచాడు’

Sep 13 2020 11:05 AM | Updated on Sep 13 2020 2:26 PM

TV Actress Sravani Mother Alleges Devaraju Cheats Her Daughter - Sakshi

శ్రావణి చనిపోయే ముందు బాత్ రూమ్‌ నుంచి దేవరాజుకు ఫోన్ చేసింది. అయినప్పటికీ దేవరాజు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. అందుకే శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రావణి చనిపోవడానికి సాయికి సంబంధం లేదని ఆమె తల్లి పాపా రత్నం చెప్పారు. కేసులో ప్రధాన నిందితుడు దేవరాజు వల్లే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవరాజు వల్లే మా అమ్మాయి శ్రావణి చనిపోయింది. సాయి.. శ్రావణిని కొట్టింది దేవరాజు నుంచి దూరంగా ఉండాలని మాత్రమే. దేవరాజు తన మీద ఉన్న కేసును తీయించుకోవడానికే మా అమ్మాయితో ప్రేమ నాటకం ఆడాడు. 
(చదవండి: విచారణకు శ్రావణి ఫ్యామిలీ, సాయి)

శ్రావణి చనిపోయే ముందు బాత్ రూమ్‌ నుంచి దేవరాజుకు ఫోన్ చేసింది. అయినప్పటికీ దేవరాజు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. అందుకే శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. సాయి లేకపోతే మా కుటుంబం ఆరోజే చనిపోయేవాళ్లం. దేవరాజుకు శ్రావణి అన్నీ చూసుకుంది. సీరియల్స్ వాళ్లు దేవరాజుకు ఒక ఎత్తు పన్ను ఉందన్నారు. శ్రావణి పది వేల రూపాయలు పెట్టి పన్ను కట్టించింది. రోజూ పాలు, గుడ్లు శ్రావణి తమ్ముడు ఇచ్చేవాడు. దేవరాజు మా అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని గ్లామర్ పెంచుకుని సీరియల్ అవకాశాలు దక్కించుకున్నాడు. మమ్మల్ని నట్టేట ముంచినాడు. కాగా దేవరాజ్‌, సాయి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఇప్పటికే పలు కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 
(చదవండి: గువ్వల్ని మింగుతున్న గద్దలు)

Advertisement
 
Advertisement
Advertisement