Prostitution Racket Busted out in Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్‌

Jan 8 2023 3:41 PM | Updated on Jan 8 2023 4:21 PM

Prostitution Racket Busted out in Hyderabad - Sakshi

ప్రతీకాత్మకచిత్రం​

సాక్షి, హైదరాబాద్‌: గుట్టుచప్పుడుకాకుండా ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ గోనె సురేష్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గౌలిదొడ్డిలోని కాన్‌క్లేవ్‌ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో సైబరాబాద్‌ యాంటీ హ్యుమన్‌ ట్రాకింగ్‌ యూనిట్‌ సభ్యులు శుక్రవారం రాత్రి 7.30 గంటలకు దాడి చేశారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులతో డేటింగ్‌ యాప్‌ ద్వారా విటులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్లు పూర్ణిమా కుమారి (22), మనీష్‌ కుమార్‌ పాండే (20), హోటల్‌ మేనేజర్‌ శ్రీమంత కలిట (35), విటుడు ఎల్‌.రవీంద్రరెడ్డిలను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిందితుడు ప్రిన్స​, ఆర్గనైజర్‌ అజయ్‌ అలియాస్‌ రాహుల్‌ పరారీలో ఉన్నారు. మహారాష్ట్ర, బీహార్‌కు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. రూ.1200 నగదు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించారు.

చదవండి: (చిత్తూరు: రొంపిచర్లలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు)

Advertisement
 
Advertisement
Advertisement