పోలీసుల వేధింపుల వల్లనే కుటుంబం ఆత్మహత్య.. యువతి  డెత్‌నోట్‌  | Police Torture: Family Commits Suicide Tragedy In Karnataka | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపుల వల్లనే కుటుంబం ఆత్మహత్య.. యువతి  డెత్‌నోట్‌ 

Nov 10 2021 7:45 AM | Updated on Nov 10 2021 8:07 AM

Police Torture: Family Commits Suicide Tragedy In Karnataka - Sakshi

సాక్షి, కోలారు(కర్ణాటక): శిశువు కిడ్నాప్‌ కేసు కేసులో తమను మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది వేధించారనే అవమానంతో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నగర మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని వివిధ సంఘాలు డిమాండ్‌ చేశాయి. కోలారు నగరంలో తల్లితండ్రులు, కొడుకు, ఆరోపణలు వచ్చిన కూతురు, మనవరాలు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

ఆరోపి పుష్ప రాసిన నాలుగు పేజీల డెత్‌నోట్‌లో మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, కుటుంబమంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ ఎక్కువ అవుతోంది. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సంఘాల కార్యకర్తలు కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement