KNR: కిడ్నాపర్ చెర నుంచి తల్లి ఒడికి | Police Solved Karimnagar Kidnap Case | Sakshi
Sakshi News home page

కరీంనగర్: కిడ్నాపర్ చెర నుంచి తల్లి ఒడికి

Feb 19 2024 9:30 AM | Updated on Feb 19 2024 9:32 AM

Police Solved Karimnagar Kidnap Case - Sakshi

 కరీంనగర్ జిల్లా:  కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి నుంచి పసికందు మాయమైన ఘటన కలకలం రేపుతోంది.  ఫిబ్రవరి 17వ తేదీ శనివారం రాత్రి ప్రభుత్వ మతా శిశు కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన  నిర్మలా దేవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. చికిత్స కోసం నిర్మలా దేవిని ఆస్పత్రి సిబ్బంది వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పసికందు మంచం దగ్గర తన ఏడేళ్ల కొడుకును తండ్రి భర్త మనోజ్ రామ్ కాపాలా ఉంచారు.

ఆ తర్వాత తమ పాప కనిపించడం లేదంటూ ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అంతా వెతికినా పాప దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో పసికందు అపహరణపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ లో కిడ్నాపర్ ను పట్టుకున్న పోలీసులు 

Advertisement
 
Advertisement
Advertisement