కీలక హెచ్‌ఓడీ పోస్టులు ఖాళీ.. నిర్ణయాల్లో జాప్యం
టీవీవీపీ కమిషనర్ పదవీ విరమణ చేసి రెండు నెలలు..
ఆయుష్, నర్సింగ్ రిజిస్ట్రార్‌కు పూర్తిస్థాయి అధిపతులు కరువు
అయోమయంలో ఆరోగ్యశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ లో పాలనాపరమైన స్తబ్దత నెలకొంది. ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ పరంగా భారీగా నిధులు కేటా యిస్తూ కొత్త ఆస్పత్రులు, వైద్య కళాశా లలు, సూపర్ స్పెషాలిటీ సేవలను విస్తరి స్తుంటే.. కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధి పతులు లేకపోవడం వల్ల నిర్ణయాల ప్రక్రి య మందగిస్తోంది. శాఖలోని అత్యంత కీల కమైన హెచ్‌ఓడీ పోస్టుల్లో చాలావరకు ఇన్‌చార్జి అధికారులే బాధ్యతలు నిర్వహిస్తుండటంతో పాలనలో స్పష్టమైన లోటు కనిపి స్తోంది.
ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న అధికారు లు తమ అసలు బాధ్యతలతోపాటు అద నపు బాధ్యతలు నిర్వహించాల్సి రావడం, కీలక విధాన నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచించడం, ఫైళ్ల పరిష్కారంలో జాప్యం వంటి సమస్యలు శాఖ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.
టీవీవీపీ కమిషనర్ పోస్టు ఖాళీగానే...
జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నిర్వహణకు కీలకమైన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ పదవి ఖాళీ అయి రెండు నెలలు దాటింది. టీవీవీపీ కమిషనర్‌గా డాక్టర్ అజయ్‌కుమార్ మే 31న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి వైద్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూనే ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. పాలన పరమైన విధుల్లో బిజీగా ఉండే ప్రభుత్వ కార్యదర్శి.. అదనపు బాధ్యత అయిన టీవీవీ పీపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించలేక పో తున్నారు.
దీన్ని అలుసుగా తీసుకొని టీవీ వీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు మందగించాయనే ఆరోపణలు న్నా యి. వర్షాకాలంలో పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో రోగాలు విజృంభించే అవకాశం ఉన్న పరిస్థి తుల్లో ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులతో మానిటరింగ్ చేయా ల్సిన టీవీవీపీ కమిషనర్ లేకపోవడం లోటు గా మారింది. టీవీవీపీ కమిషనర్ నియా మకం కోసం అర్హుల జాబితాను తయారు చేసి ఫైల్‌ను సీఎంకు పంపించగా, రెండు నెలలు దాటినా నిర్ణయం తీసుకోలేదు.
తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌గా విద్యావతి పదవీ విరమణ చేసి సంవత్సరం గడుస్తున్నా రెగ్యులర్ నియామకం జరగ లేదు.డిప్యూటీ డైరెక్టర్ విద్యుల్లత ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నర్సింగ్ కళా శాలలకు అనుమతులు, నమోదు ప్రక్రియ, నర్సుల రిజి స్ట్రేషన్, తనిఖీలు వంటి కీలక బాధ్యతలు ఈ కౌన్సిల్ పరిధిలో ఉంటాయి. పూర్తిస్థాయి అధిపతి లేకపోవడంతో అనేక పరిపాలనా నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్న ట్లు తెలుస్తోంది. ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న విద్యుల్లత ఏకంగా మూడు పోస్టులను నిర్వ హిస్తూ, కొత్త నియా మకానికి సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి.
ఆయుష్ శాఖలోనూ అంతే...
ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి సేవల విస్తరణకు బాధ్యత వహించే ఆయుష్ శాఖలో కూడా పూర్తి స్థాయి డైరెక్టర్ లేకుండా ఇన్‌చార్జి వ్యవస్థనే సాగిస్తున్నారు. ఇన్‌చార్జి డైరెక్టర్‌గా శ్రీకాంత్‌బాబు ఉన్నారు. తాజాగా మంగళవారం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా నాన్ కేడర్ అధికారి కె. విద్యాసాగర్‌ను నియమించారు. గత కొంతకాలంగా ఈ పదవి కూడా ఇన్‌చార్జి పాలనలోనే ఉంది.
ప్రజారోగ్యంలో 12 ఏళ్లుగా..
రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా భావించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) కార్యాలయంలో 12 ఏళ్లుగా పూర్తిస్థాయి డైరెక్టర్ నియామకం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోస్టును రెగ్యులర్ పోస్టుగా పునరుద్ధరించినప్పటికీ ఇప్పటివరకు నియామకం చేపట్టలేదు. అలాగే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పోస్టు భర్తీకి అవసరమైన డిపార్ట్‌మెంటల్ ప్రమో షన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా నెలల తరబడి అది జరగడం లేదు. సీనియర్ అధికారుల పదోన్నతులు, పోస్టింగ్‌లు నిలిచిపోవడంతో దిగువస్థాయి పాల నపై కూడా ప్రభావం పడుతోంది.


