మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు | Guntur East Ex MLA Mohammad Mustafa Remanded for 14 Days in Kidnap Case | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు

Aug 6 2026 5:46 AM | Updated on Aug 6 2026 12:40 PM

Guntur East Ex MLA Mohammad Mustafa 14 Days Remand

ఆంధ్రప్రదేశ్‌: గుంటూరు తూర్పు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, ఆయన తనయుడు బషీర్‌పై నూజివీడు పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం గుజరాత్‌లో ఉన్న ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకుని నూజివీడుకు తీసుకొచ్చారు.

అనంతరం ఆయనను నూజివీడు కోర్టులో హాజరుపరచగా, కేసును విచారించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ముస్తఫాను నెల్లూరు జైలుకు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ న్యాయస్థానంలో కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement