డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడి కానిస్టేబుల్‌ సస్పెండ్‌ | Police Constable Suspended Over Drunk And Drive | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడి కానిస్టేబుల్‌ సస్పెండ్‌

Jun 10 2021 4:40 PM | Updated on Jun 10 2021 5:17 PM

Police Constable Suspended Over Drunk And Drive - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన బహదూర్‌పురా కానిస్టేబుల్‌ కె.వెంకటేశ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. విధులకు హజరవుతున్న వెంకటేశ్‌ మద్యం సేవించి ఉండటంపై రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ వెంటనే సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఓ కానిస్టేబుల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడి సస్పెండ్‌ అవ్వడంపై పోలీసు శాఖలో చర్చనీయాశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement