Karnataka: Police Caught Accused With Help Of Beer Bottle Cap - Sakshi
Sakshi News home page

ఆధారాలు దొరకలేదు.. చివరికి బీరు సీసా మూత నిందితులను పట్టించింది

Jul 27 2023 10:58 AM | Updated on Jul 27 2023 11:16 AM

Police Caught Accused With Help Of Beer Bottle Cap Karnataka - Sakshi

బెంగళూరు: బీరు సీసా మూత నిందితులను పట్టించింది. బెంగళూరులోని మిలీనియం బార్‌ వద్ద ఈనెల 16న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి ఘటనను చంద్రాలేఔట్‌ పోలీసులు ఛేదించారు. అప్రోజ్‌, రాకేశ్‌, రాజు, ఆదిల్‌ పాషా అనే నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. మిథున్‌రాజ్‌, ముత్తురాజ్‌ అనే స్నేహితులు ఆటోలో పాటలు పెట్టుకొని మాట్లాడుకుంటుండగా రెండు బైక్‌ల్లో వచ్చిన నిందితులు బీరు బాటిళ్లతో తలలపై దాడి చేసి పారిపోయారు.

బాధితులు రక్తం మడుగులో పడి ఉండగా ఆస్పత్రికి తరలించారు. చంద్రలేఔట్‌ ఎస్‌ఐ రవీశ్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీకెమెరాల్లో కూడా నిందితుల కదలికలు లేవు. కేవలం ఘటన స్థలిలో బీరు బాటిల్‌ మూత లభించింది. బ్యాచ్‌ నంబర్‌ ఆధారంగా కొనుగోలు చేసిన బార్‌ ఆచూకీ లభించింది. అక్కడకు వెళ్లి సీసీకెమెరా పరిశీలించగా నిందితులు బీర్లు కొనుగోలు చేసి బైక్‌లో వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. గాలింపు చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేశారు. కాగా ఎందుకు దాడికి పాల్పడ్డారని ప్రశ్నించగా ఊరికేనే దాడి చేసినట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: భర్తకు దూరంగా.. ప్రియుడికి ఫోన్‌ చేసి నేను చనిపోతాను...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement