స్నేహితుడి కుమార్తెపై లైంగికదాడి | POCSO Case registered Nellore man | Sakshi
Sakshi News home page

స్నేహితుడి కుమార్తెపై లైంగికదాడి

Jun 23 2025 12:41 PM | Updated on Jun 23 2025 12:41 PM

POCSO Case registered Nellore man

ఆలస్యంగా వెలుగులోకి.. 

పోక్సో కేసు నమోదు 

నెల్లూరు (క్రైమ్‌): కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి స్నేహితుడి కుమార్తెపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో ఆదివారం విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు..  

సంతపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, పదిహేడేళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి వారధి సెంటర్‌కు చెందిన కుమార్‌ స్నేహితుడు ఉన్నాడు. ఇరు కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. అందరూ కలిసి బయటకు వెళ్లేవారు. ఈ ఏడాది మార్చిలో ఇరు కుటుంబాలు తిరుమలకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో కుమార్‌ అతని భార్య, స్నేహితుడి కుమార్తె శ్రీకాళహస్తికి వెళ్లారు. అక్కడే ఉండి మార్చి 16న నెల్లూరుకు వచ్చారు. బాలిక కుమార్‌ ఇంట్లో ఉండగా, అతని భార్య వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లింది. 

ఇదే అదనుగా భావించిన కుమార్‌ బాలికను బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన ఆమె ఎవరికి చెప్పలేదు. రెండు నెలలుగా బాలికకు పీరియడ్స్‌ రాకపోవడంతో బాధిత తల్లి ఆమెను శనివారం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలు ఆదివారం సంతపేట పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్‌ జి. దశరథరామారావు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement