అప్పులు తీర్చేందుకు బిడ్డ అమ్మకం

Parents Who Sold The Son To Pay Off Debts In Karnataka - Sakshi

మనసు మార్చుకున్న దంపతులు

ఐదు నెలల చిన్నారిని రక్షించిన పోలీసులు

నిందితుల అరెస్ట్‌ 

హుబ్లీ(కర్ణాటక): అప్పులు తీర్చండి... లేదంటే బిడ్డను అమ్మండి అంటూ..వీుటర్‌ వడ్డీ దారులు హుకుం జారీ చేశారు. గత్యంతరం లేక పేద దంపతులు తమ ఐదు నెలల మగ బిడ్డను వారి చేతిలో పెట్టారు. బిడ్డపై మమకారంతో మనసు మార్చుకొని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి బాలుడిని రక్షించి చిన్నారిని కొనుగోలు చేసిన నిందితులను అరెస్ట్‌ చేశారు. వివరాలు.. హుబ్లీలోని విద్యాగిరిలో రూప, మైనుద్దీన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు.  వీరు ఇంటి నిర్మాణం కోసం మీటర్‌ వడ్డీదారుల వద్ద అప్పులు చేశారు.

వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో బాకీ తీర్చాలని ఆసాములు డిమాండ్‌ చేశారు. అప్పులు తీర్చకపోతే బిడ్డను అమ్మాలని ఒత్తిడి చేశారు. దీంతో తమ ఐదు నెలల మగబిడ్డను రూ. 2.50లక్షలకు విక్రయించారు. బిడ్డ దూరం కావడంతో మనో వేదనకు గురైన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలసులు గాలింపు చేపట్టి భారతీ మంజునాథ వాల్మీకి(48), రమేష్‌ మంజునాథ్‌(48), రవి బీమసేనా హేగ్డే(38), వినాయక అర్జున మాదర(27), ఉడుపికి చెందిన విజయ్‌ బసప్ప నెగళూరు(41), చిత్ర విజయ్‌ నెగళూరును  అరెస్ట్‌ చేశారు. వారినుంచి బిడ్డను  స్వాధీనం చేసుకొని  బాలల సంక్షేమ సమితికి అప్పగించారు.
చదవండి:
నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి..
కర్ణాటక రాసలీలల సీడీ కేసులో కీలక మలుపు 

   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top