పెళ్లైన 20 రోజులకే.. ప్రేమజంట ఆత్మహత్య | Newly Married Lovers End Their Life At Tiruvottiyur Tamil Nadu | Sakshi
Sakshi News home page

పెళ్లైన 20 రోజులకే.. ప్రేమజంట ఆత్మహత్య

Apr 28 2022 11:19 AM | Updated on Apr 28 2022 11:19 AM

Newly Married Lovers End Their Life At Tiruvottiyur Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు (తమిళనాడు): నామక్కల్‌ జిల్లాలో ప్రేమించి వివాహం చేసుకున్న 20 రోజులకే ఓ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుభజిత్‌(22). ఇతను నామక్కల్‌ జిల్లా పల్లిపాలెం డీవీఎస్‌ మెట్టు ప్రాంతంలో ఉంటూ అక్కడున్న ఒక పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతను వెస్ట్‌ బెంగాల్, మేథి ఊరుకు చెందిన 10వ తరగతి చదువుతున్న సంభజన (17)ను ప్రేమించాడు. వీరి ప్రేమను ఇద్దరి ఇంట్లో వ్యతిరేకించారు.

ఈ క్రమంలో సుభజిత్‌ పశ్చిమబెంగాల్‌కు చెందిన మేథి ఊరుకు వెళ్లాడు. తరువాత గత 20 రోజులకు ముందు సంభజనను ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా అక్కడున్న ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. తరువాత  భార్య అయిన సంభజనను నామక్కల్‌ జిల్లా పల్లిపాళయంకు తీసుకువచ్చాడు. అక్కడ ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ సుభజిత్, సంభజన బయటకు రాకపోవడంతో అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. పల్లిపాళయం పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సుభజిత్, సంభజన ఉరేసుకుని శవాలుగా వేలాడుతున్నారు. దీంతో వారి మృతదేహాలను శవ పరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement