కన్న కొడుకు నిర్వాకం.. తండ్రి పోయాక ఆస్తులు రాయించుకుని అమెరికాకు

Mother Protests That Her Son Has Cheated In Krishna District - Sakshi

గన్నవరం (కృష్ణా జిల్లా): నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకుడిని చేస్తే తీరా తన కుమారుడు విదేశాలకు వెళ్లిపోయి తనను పట్టించుకోవడం లేదంటూ ఓ వృద్ధురాలు నిరసన దీక్షకు దిగిన సంఘటన గన్నవరంలో శనివారం చోటు చేసుకుంది. తన ఇంటి ముందు టెంట్‌ వేసుకుని కూర్చున్న ఆమె తనకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేసింది. వివరాలిలా ఉన్నాయి.

చదవండి: ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం.. ప్రేమించానని నమ్మించి..

గన్నవరానికి చెందిన గరిమెళ్ల సత్యనాగకుమారి భర్త 2001లో రోడ్డుప్రమాదంలో మరణించాడు. ఒకే ఒక కుమారుడు వెంకట ఫణీంద్రకుమార్‌ ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త చేసిన అప్పులు తీర్చాలని రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆస్తులు అమ్మి తీరుస్తానని తన కుమారుడు చెప్పగా, తన పేరున, తన భర్త పేరున ఉన్న ఆస్తులన్నీ తన కుమారుడి పేరిట బదలాయించానని చెప్పింది. అయితే తన కుమారుడు తనను నమ్మించి నయవంచన చేశాడని వాపోయింది.

అప్పులు తీర్చకుండా, తనకు చెప్పాపెట్టకుండా అమెరికా పారిపోయాడని, కనీసం తన యోగక్షేమాలు కూడా పట్టించుకోవడం లేదని విలపిస్తూ చెప్పింది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని ఏళ్లతరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని, తాను ఇప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేసింది. తనకు న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించనని తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తన కుమారుడు వెంకటఫణింద్రకుమార్‌ ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపింది. అయితే 2001లో తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పింది. అయితే తన భర్త చేసిన అప్పులను తీర్చాలని రుణదాతల నుండి ఒత్తిడి పెరగడంతో ఆస్తులు అమ్మి తీర్చుతానని తన కుమారుడు నమ్మించాడని తెలిపింది. దీంతో తనతో పాటు తన భర్త పేరున ఉన్న ఆస్తులను కుమారుడికి బదలాయించినట్లు వివరించారు.

తీరా అప్పులు తీర్చకుండా తన కుమారుడు చెప్పపెట్టకుండా అమెరికా వెళ్లిపోవడంతో పాటు కనీసం తన యోగాక్షేమాలు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయం చేయాలని ఏళ్ల తరబడి అధికారులు చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నానని,  ఇప్పటికైన అధికారులు స్పందించి కన్నతల్లికి అన్యాయం చేసిన కుమారుడిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు దీక్షను విరమించనని స్పష్టం చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top