breaking news
cheated son
-
కన్న కొడుకు నిర్వాకం.. తండ్రి పోయాక ఆస్తులు రాయించుకుని అమెరికాకు
గన్నవరం (కృష్ణా జిల్లా): నవమాసాలు మోసి కని పెంచి ప్రయోజకుడిని చేస్తే తీరా తన కుమారుడు విదేశాలకు వెళ్లిపోయి తనను పట్టించుకోవడం లేదంటూ ఓ వృద్ధురాలు నిరసన దీక్షకు దిగిన సంఘటన గన్నవరంలో శనివారం చోటు చేసుకుంది. తన ఇంటి ముందు టెంట్ వేసుకుని కూర్చున్న ఆమె తనకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేసింది. వివరాలిలా ఉన్నాయి. చదవండి: ఫేస్బుక్ ద్వారా పరిచయం.. ప్రేమించానని నమ్మించి.. గన్నవరానికి చెందిన గరిమెళ్ల సత్యనాగకుమారి భర్త 2001లో రోడ్డుప్రమాదంలో మరణించాడు. ఒకే ఒక కుమారుడు వెంకట ఫణీంద్రకుమార్ ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త చేసిన అప్పులు తీర్చాలని రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆస్తులు అమ్మి తీరుస్తానని తన కుమారుడు చెప్పగా, తన పేరున, తన భర్త పేరున ఉన్న ఆస్తులన్నీ తన కుమారుడి పేరిట బదలాయించానని చెప్పింది. అయితే తన కుమారుడు తనను నమ్మించి నయవంచన చేశాడని వాపోయింది. అప్పులు తీర్చకుండా, తనకు చెప్పాపెట్టకుండా అమెరికా పారిపోయాడని, కనీసం తన యోగక్షేమాలు కూడా పట్టించుకోవడం లేదని విలపిస్తూ చెప్పింది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని ఏళ్లతరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని, తాను ఇప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేసింది. తనకు న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించనని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తన కుమారుడు వెంకటఫణింద్రకుమార్ ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపింది. అయితే 2001లో తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పింది. అయితే తన భర్త చేసిన అప్పులను తీర్చాలని రుణదాతల నుండి ఒత్తిడి పెరగడంతో ఆస్తులు అమ్మి తీర్చుతానని తన కుమారుడు నమ్మించాడని తెలిపింది. దీంతో తనతో పాటు తన భర్త పేరున ఉన్న ఆస్తులను కుమారుడికి బదలాయించినట్లు వివరించారు. తీరా అప్పులు తీర్చకుండా తన కుమారుడు చెప్పపెట్టకుండా అమెరికా వెళ్లిపోవడంతో పాటు కనీసం తన యోగాక్షేమాలు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయం చేయాలని ఏళ్ల తరబడి అధికారులు చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నానని, ఇప్పటికైన అధికారులు స్పందించి కన్నతల్లికి అన్యాయం చేసిన కుమారుడిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు దీక్షను విరమించనని స్పష్టం చేసింది. -
రుణం కోసం బతికున్న తండ్రిని ‘చంపేసి’ ..!
సాక్షి, సిటీబ్యూరో: తండ్రి ఆస్తిపై రుణం తీసుకోవడానికి ఓ సుపుత్రుడు భారీ స్కెచ్ వేశాడు. బతికున్న తండ్రి చనిపోయినట్లు పత్రాలు సృష్టించడంతో పాటు స్నేహితుడిని స్థిరాస్తిని విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు. వీరిద్దరితో పాటు మరో ఆరుగురితో కలిసి కథ నడిపి ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించకపోవడం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. సికింద్రాబాద్‌లోని కాకగూడ వాసవీనగర్‌కు చెందిన కె.వెంకటేశ్వరరావు కొన్నాళ్ళుగా మస్కట్‌లో ఉంటున్నారు. ఆయన కొడుకు కె.సుధాకర్ ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. కాకగూడలో తండ్రి ఇంటిపై కన్నేసిన సుధాకర్ దాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని భావించాడు. దీనికోసం తన స్నేహితుడైన వరప్రసాద్‌తో పాటు రాజ్యలక్ష్మి, కిరణ్, వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కనకాంబరరావు, నాగేంద్రలతో కలిసి పథకం రచించాడు. ఇందులో భాగంగా తండ్రి వెంకటేశ్వరరావు చనిపోయినట్లు ఓ మరణ ధ్రువీకరణ పత్రాన్ని తయారుచేశారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డ్ దీన్ని జారీ చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించాడు. దీంతోపాటు ఇతర పత్రాలను సృష్టించిన సుధాకర్ వాసవీనగర్‌లో ఉన్న ఇంటిని తన స్నేహితుడు వరప్రసాద్‌కు విక్రయిుస్తున్నట్లు సేల్‌డీడ్ రూపొందించాడు. వీటి ఆధారంగా అంతా కలిసి మాగ్న ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.89 లక్షల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించడంలో విఫలం కావడం.. కంపెనీ ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కంపెనీ ప్రతినిధులు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీలు జోగయ్య, కె. రామ్‌కుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ బి. రవీందర్‌రెడ్డి గురువారం సుధాకర్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.