రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి

Molestation on Two Year Child at Doddaballapur Karnataka - Sakshi

కామాంధుడు అరెస్ట్‌  

సాక్షి, దొడ్డబళ్లాపురం(బెంగళూరు): రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్యాయత్నం చేసిన కామాంధున్ని మంగళూరు పోలీసులు అరెస్టు చేసారు. బిహార్‌కు చెందిన చందన్‌ (38) నిందితుడు. మంగళూరులోని హోయి బజార్‌లో బిహార్‌కు చెందిన సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఆదివారం సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో చందన్‌ ఓ  బాలికపై అత్యాచారం చేసి అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన తల్లితండ్రులు కాలనీ అంతా వెదికి చివరగా రాత్రి 9 గంటల సమయంలో నీటి ట్యాంకులో చూడగా చిన్నారి స్పృహతప్పి పడి ఉంది. తక్షణం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సోమవారం విచారణ జరపగా చిన్నారిని చందన్‌ తీసికెళ్లాడని తెలిసింది. చందన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా నిజం ఒప్పుకున్నాడు.  

చదవండి: (విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top