భర్త పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. నవ్య అనారోగ్యంతో గుంటూరులో.. | Married Woman Suspicious Death in Guntur District | Sakshi
Sakshi News home page

భర్త పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. నవ్య అనారోగ్యంతో గుంటూరులో..

Jan 31 2022 4:03 PM | Updated on Jan 31 2022 4:36 PM

Married Woman Suspicious Death in Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన మండలంలోని నల్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ ప్రేమయ్య తెలిపిన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం సమీపంలోని సంఘంపల్లి గ్రామానికి చెందిన నవ్య(31), నల్లపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. రాజశేఖర్‌ పూనెలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవాడు.

ఈ క్రమంలో నవ్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో మృతురాలి తండ్రి రఘుకు సమాచారం అందించగా ఇంటికి వచ్చిన ఆయన తన కుమార్తెను అత్త, మామ, భర్తలే కావాలని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..)

Advertisement
 
Advertisement
Advertisement