ప్రేమ పెళ్లి, ఎవరితో మాట్లాడినా అనుమానం.. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా.. | Married Woman Suicide Over Husband Harassment Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి, ఎవరితో మాట్లాడినా అనుమానం.. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా..

Mar 5 2022 12:58 PM | Updated on Mar 5 2022 1:09 PM

Married Woman Suicide Over Husband Harassment Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,బన్సీలాల్‌పేట్‌: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు కథనం ప్రకారం.. కవాడిగూడ దేవీనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌ భార్య శ్రీదేవీ(32) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధిస్తుండటంతో మానసిక ఒత్తిడి తట్టుకోలేక శ్రీదేవీ ఇంట్లో  ఫ్యాన్‌కు ఉరేసుకొని మరణించింది.

భర్త చంద్రశేఖర్‌ భార్య శ్రీదేవీ ఎవరితో మాట్లాడినా అనుమానపడేవాడని.. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మని వేధించేవాడని పోలీసులు తెలిపారు. అనేక సార్లు పెద్ద సమక్షంలో పంచాయితీ కూడా పెట్టి ఇరువురికి సర్ధిచెప్పినా ఎలాంటి మార్పు రాకపోవడంతో శ్రీదేవీ ఆత్మహత్యే శరణ్యంగా భావించి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా హాల్‌లో ఉరేసుకుంది. చంద్రశేఖర్, శ్రీదేవీ 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి 8, 4 ఏళ్ల వయస్సుగల ఇద్దరు అబ్బాయిలు.

Advertisement
 
Advertisement
Advertisement