ప్రేమ పెళ్లి.. ‘వేధింపులు భరించలేకపోతున్నా..నన్ను క్షమించండి’ అంటూ

Married Woman Suicide Due To In Laws Harassing For Extra Dowry Ramagundam - Sakshi

సాక్షి, రామగుండం(పెద్దపల్లి): ‘నాన్నా.. కట్నం వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి.. అందుకే నా బాబుతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా.. (రియల్లీ ఐ వాంట్‌ టూ డై విత్‌ మై బేబీ) నన్ను క్షమించండి’అంటూ ఓ వివాహిత తండ్రికి మెసేజ్‌ పంపి ఆత్మ హత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎస్సై వెంకట్‌ కథనం ప్రకారం.. రామగుండం రైల్వేస్టేషన్‌ ఏరియా భరత్‌నగర్‌కు చెందిన మాణిక్యాల సదానందరెడ్డి కూతురు ధనశ్రీ.. అదే కాలనీకి చెందిన దండుగుల రాకేశ్‌ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు కాదనడంతో వారిని ఎదిరించిన ధనశ్రీ గతేడాది మేలో రాకేశ్‌ను ఆదర్శ వివాహం చేసుకుంది. అయితే, కొంతకాలం తర్వాత ధనశ్రీకి పుట్టింటితో సఖ్యత కుదిరింది. రెండు కుటుంబాలు కలిసి పోయాయి.

అయితే పెళ్లి తర్వాత రాకేశ్‌ ఏ నిచేయకుండా నిత్యం మద్యం తాగడం, కట్నం తేవాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు బాధితురాలు మొరపెట్టుకోగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించి రూ.50 వేలను ధనశ్రీ అత్తింటి వారికి అప్పగించారు. ధనశ్రీ కూడా ఇంటివద్ద ట్యూషన్లు చెబుతూ కొంత ఆదాయం సంపాదిస్తోంది. ఇలా సాఫీగానే సాగిన క్రమంలో వారికి కుమారుడు (4 నెలలు) పుట్టాడు.

అయినప్పటికీ రాకేశ్‌ ప్రవర్తనలో మార్పురాలేదు. భర్త మద్యం తాగి కట్నం కోసం వేధించడం, అత్తామామల సూటిపోటి మాటలతో ధనశ్రీ విసిగిపోయింది. ఆదివారం తన తల్లిగారింటికి వెళ్లి అత్తింటి వేధింపులపై వారితో మొరపెట్టుకుంది. వారు సర్దిచెప్పగా సాయంత్రానికి తిరిగి అత్తగారింటికి వచి్చన ధనశ్రీ.. గదిలో ఎవరూ లేని సమయంలో తాను బిడ్డతో కలిసి చనిపోతున్నానంటూ తండ్రికి ఫోన్‌లో మెసేజ్‌ పెట్టింది.

తొలుత బాబుతో కలిసి ఉరివేసుకోవాలని అనుకున్నా.. బిడ్డపై మమకారంతో బాబును వదిలేసి తానే దూలానికి చీరతో ఉరి వేసుకుంది. చప్పుడు కావడంతో గదిలోకి వచ్చిన కు టుంబ సభ్యులు.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ధనశ్రీని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రవీకరించారు. తన కూతురు మృతికి ఆమె అత్తింటివారే కారణమని సదా నందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top