భార్య కోరికల్ని తీర్చటానికి ఓ భర్త.. | Man Thefts Bikes For Fulfill His Wifes Demands In Gujarat | Sakshi
Sakshi News home page

భార్య కోరికల్ని తీర్చటానికి ఓ భర్త..

Nov 30 2020 5:59 PM | Updated on Nov 30 2020 7:25 PM

Man Thefts Bikes For Fulfill His Wifes Demands In Gujarat - Sakshi

పోలీసులు అదుపులో నిందితుడు

అయితే అతడి భార్యకు వారి సాధారణ జీవితం నచ్చలేదు. తన జీవితాన్ని ధనవంతురాలైన ఆమె అక్క జీవితంతో పోల్చుకునేది...

సూరత్‌ : భార్య డిమాండ్లను నెరవేర్చటానికి దొంగ అవతారం ఎత్తాడో భర్త. ఆమెకు విలాసవంతమైన జీవితాన్ని అందించటానికి బైకులు దొంగతనాలు చేస్తూ చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భావ్‌నగర్‌ జిల్లా జలియ గ్రామానికి చెందిన బల్వంత్‌ చౌహాన్‌ వజ్రాలకు మెరుగులుదిద్దే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్యకు వారి సాధారణ జీవితం నచ్చలేదు. తన జీవితాన్ని ధనవంతురాలైన ఆమె అక్క జీవితంతో పోల్చుకునేది. బిల్డర్‌ అయిన అక్క భర్తతో తన భర్తకు సాటికట్టేది. ప్రతి రోజు మూతి విరుపులు, దెప్పిపొడుపులు మామూలైపోయాయి.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు
దీంతో ఆమె పోరు భరించలేక బైకుల దొంగతనాలు మొదలుపెట్టాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం పోవటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బైకుల దొంగతనాలను మొదలుపెట్టాడు. 2017లో మొదటిసారి బైకు దొంగతనం చేశాడు. అనంతరం 2019లో నాలుగు.. 2020లో ఏకంగా 25 బైకుల్ని దొంగిలించాడు. ఆదివారం బైకు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement