Kerala Couple Post Wedding Shoot Turns Tragic - Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన ఫోటోషూట్‌.. పెళ్లైన రెండు వారాలకే..

Apr 5 2022 3:52 PM | Updated on Apr 5 2022 6:44 PM

Kerala Couple Post Wedding Shoot Turns Tragic - Sakshi

కేరళలో విషాదం చోటుచేసుకుంది.  పోస్ట్‌ వెడ్డింగ్‌ షూట్‌ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోజీకోడ్‌ జిల్లా కోజీకోడ్‌ ప్రాంతంలో రెజిన్‌లాల్‌ అనే యువకుడికి కనికా అనే యువతితో మార్చి 14న వివాహం జరిగింది. అయితే పెళ్లి బిజీ షెడ్యూల్‌ కారణంగా ఏప్రిల్‌ 4న పోస్ట్‌ వెడ్డింగ్‌ షూట్‌ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇందుకు కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక కుట్టియాడి నది వద్దకు వెళ్లారు. 

బంధువులు నది ఒడ్డున ఉండగా.. నవదంపతులిద్దరూ నదిలో దిగి ఫోటో షూట్ చేస్తున్నారు. ఇంతలో నదీప్రవాహం పెరగడంతో  ఇద్దరు కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరిని ఒడ్డుకి చేర్చగా.. అప్పటికే రెజిన్‌లాల్‌ మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వధువుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కనికా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఇక ఈఘటనపై కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పెళ్ళైన రెండు వారాలకే వరుడు చనిపోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement