breaking news
photo shot
-
విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే..
కేరళలో విషాదం చోటుచేసుకుంది. పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోజీకోడ్ జిల్లా కోజీకోడ్ ప్రాంతంలో రెజిన్‌లాల్ అనే యువకుడికి కనికా అనే యువతితో మార్చి 14న వివాహం జరిగింది. అయితే పెళ్లి బిజీ షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 4న పోస్ట్ వెడ్డింగ్ షూట్ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇందుకు కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక కుట్టియాడి నది వద్దకు వెళ్లారు. బంధువులు నది ఒడ్డున ఉండగా.. నవదంపతులిద్దరూ నదిలో దిగి ఫోటో షూట్ చేస్తున్నారు. ఇంతలో నదీప్రవాహం పెరగడంతో ఇద్దరు కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరిని ఒడ్డుకి చేర్చగా.. అప్పటికే రెజిన్‌లాల్ మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వధువుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కనికా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఇక ఈఘటనపై కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పెళ్ళైన రెండు వారాలకే వరుడు చనిపోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. -
బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్ (ఫొటోలు)
-
ఫ్యాన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో షూట్
నటీ నటులకు అభిమానులే కొండంత అండ. అభిమానుల అభిమానానికి ఖరీదు కట్టడం ఎవరివల్లా కాదు. అభిమానులు హీరోలపై తమ అభిమానాన్ని చాటుకోవటానికి ప్రాణాలు సైతం పణంగా పెడతారంటే అతిశయోక్తి కాదేమో. అయితే వారు తమ అభిమాన హీరో నుంచి ఏం కోరుకుంటారు. కుదిరితే దగ్గరగా చూడాలని, ఓ మాట మాట్లాడాలని వీలైతే ఫోటో దిగాలనేది వారి కోరిక. 'అభిమానుల ఆశీస్సులే తమకు శ్రీరామ రక్ష' అని హీరోలు వేదికలపై చెప్పటం సాధారణమే. అసలు విషయానికి వస్తే కష్టకాలంలో కూడా తన వెంటే ఉన్న అభిమానుల కోసం ఏదైనా చేయాలనీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఇటీవల ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోతున్నాయి . అయినా అభిమానులు తమ అభిమాన హీరోపై ఆదరాభిమానాలు చూపిస్తూ వస్తున్నారు. ఫిల్మ్ నగర్ కథనాల ప్రకారం ఎన్టీఆర్ అభిమానులతో స్పెషల్ 'ఫోటో షూట్' ప్లాన్ చేశాడట. అతి త్వరలో అభిమానులతో ఓ భారీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాట. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్‌కు కాలం కలిసి రావటం లేదనే చెప్పాలి. అతడు నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అంతేకాకుండా గత కొంతకాలంగా నందమూరి ఫ్యాన్‌తో పాటు, టీడీపీ యూత్ కూడా జూనియర్ కు దూరంగా ఉంటున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, మామ చంద్రబాబుతో పాటు బాబాయి బాలయ్యతో కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన ప్రచారంలో కూడా పాల్గొనలేదన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఎన్టీఆర్ సినిమాలపై బాగా పడినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో ఎన్టీఆర్ అభిమానులకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి జూనియర్ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.