విజేశ్, ప్రమిత దంపతులు, బిడ్డ లియా (ఫైల్), బురదలో కూరుకుపోయిన కారు
కర్ణాటక: కారు అదుపుతప్పి చెరువులో పడిన ఘటనలో తల్లిదండ్రులు, పసికందు మృతి చెందారు. ఈ ప్రమాదం కొడగు జిల్లా మడికెరి తాలూకా మాల్యారె పరిధిలో జరిగింది. సిద్ధాపుర హైస్కూల్ పైసారికి చెందిన విజేశ్ (36), భార్య ప్రమిత (34), కూతురు లియ (4) మరణించారు. కారులో మాల్యారె వద్ద బంధువుల ఇంటికి వెళ్లారు. పెద్ద కూతురిని అక్కడ వదిలిపెట్టి చిన్న కూతురిని తీసుకుని తిరిగి తాము పనిచేస్తున్న ఎస్టేట్‌కు బయల్దేరారు. చెరువు కట్ట రోడ్డు వెళుతుండగా ఒక చక్రం కిందకు జారింది, దీంతో కారు చెరువులో బురదలోకి దిగబడింది. రాత్రి కావడంతో ఎవరూ గుర్తించలేకపోయారు.
ఆస్పత్రికి తీసుకెళ్లగా
గాయపడి బాధితులు కారులో నుంచి బయటకు రాలేక, ఊపిరాడక అలాగే ప్రాణాలొదిలారు. బుధవారం ఉదయం ఆ దారిన వెళ్తున్న కార్మికులు కారులోనివారిని బయటకు తీసి సిద్ధాపుర ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు. మడికెరి ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. కన్నవారు దూరమై వారి పెద్ద కూతురు అనాథగా మారింది.


