అమ్మ దర్శనం.. పులకించిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

అమ్మ దర్శనం.. పులకించిన భక్తజనం

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

బళ్లారిఅర్బన్‌: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని బళ్లారి నగరంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో దసరా పండుగ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, పూజలు జరిపారు. నవరాత్రుల్లో 9 రోజులు విశేషంగా అమ్మవారు శక్తి రూపాల్లో అవతరించి భక్తులకు దర్శనం ఇవ్వగా, పండుగ రోజున నిజరూప అలంకరణలతో పాటు ఆయా ఆలయాల్లో ఆభరణాలు, పూల అలంకరణల్లో అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు భక్తితన్మయత్వంతో పులకించారు. మహామంగళ హారతి అనంతరం అన్నదానం చేశారు. స్థానిక భక్తులతో పాటు ఆలయాల వద్ద జమ్మి(బన్ని) చెట్టును దర్శించుకొని జమ్మి పత్రిని పెద్దలకు సమర్పించి నమస్కరించారు. నగర వాసుల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 11 నుంచి 21 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు దేవస్థానం ఈఓ టీ.సెల్వమణి, దేవస్థాన ప్రధాన అర్చకులు పూజారి గాదెప్ప బుధవారం తెలిపారు.

వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

హొసపేటె: దసరా పండుగ సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. శరన్నవరాత్రుల ముగింపు, విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. దసరా పండుగ వేళ అమ్మవారి విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలతో హొసపేటె నగరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

అలరించిన దేవర బన్నీ ఉత్సవం

విజయనగర జిల్లా హొసపేటె పరిసర ప్రాంతంలోని ధర్మదగుడ్డపై జరిగిన దేవర బన్ని ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారం సాయంత్రం వివిధ గ్రామాల నుంచి ఉత్సవమూర్తులను పల్లకుల్లో తీసుకువచ్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. భక్తుల పల్లకీల ఊరేగింపులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

హులిగిలో దసరా వేడుక

కొప్పళ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హులిగిలోని హులిగమ్మ దేవి ఆలయంలో నవరాత్రి, దసరా వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. విజయదశమి సందర్భంగా ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దసరా వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు హులిగమ్మ దేవిని దర్శించుకున్నారు.

రాయచూరు రూరల్‌: నగరసభ ఆధ్వర్యంలో నిర్వహించిన నాడ హబ్బ ఉత్సవాలను కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య నాడదేవికి పూజలు చేసి ప్రారంభించారు. నగరసభ కార్యాలయం నుంచి బన్ని మంటపం వరకు ఊరేగింపు చేపట్టారు. విధాన పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా నిర్వహించారు. జిల్లాధికారిణి పూవిత, నగరసభ కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

హొసపేటె: హోమ పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

హొసపేటె: ధర్మదగుడ్డ వద్ద పల్లకీలో అమ్మవారి ఊరేగింపు

సిరుగుప్ప రోడ్డులో అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ

కన్యకాపరమేశ్వరికి ఆభరణాలు, బంగారు చీరతో అలంకరణ

పటేల్‌ నగర్‌ చిన్న దుర్గమ్మకు విజయదుర్గా దేవి అలంకరణ

సంతోషి మాతకు

ప్రత్యేక అలంకరణ

హవంబావి సీతారామ ఆశ్రమంలో రాజరాజేశ్వరి దేవి అలంకరణ

బెంకి మారెమ్మకు

వెండి కవచంతో అలంకరణ

భద్ర కాళి అలంకరణలో

కన్యకా పరమేశ్వరి అమ్మవారు

ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement