సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరులో ఉద్రిక్తత నెలకొంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు.. వైఎస్సార్‌సీపీ నేతల నామినేషన్లను అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను నిర్బంధించారు. టీడీపీ మూకలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. సాక్షి టీవీ స్థానిక ప్రతినిధి ప్రసాద్‌పై చింతమనేని దాడి చేశారు. ప్రసాద్ చొక్కా చించి ఫోన్ లాక్కున్న చింతమనేని దౌర్జన్యానికి దిగారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం ఎనిమిది మంది ఎంపీటీసీ మహిళా అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. 8 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు, ప్రపోజల్స్‌ని మాత్రమే నామినేషన్ వేయడానికి అనుమతించాలని వైఎస్సార్‌సీపీ నేతలు వేడుకుంటున్నారు.
కడప-పులివెందుల రోడ్డుపై కూర్చుని వైఎస్సార్‌సీపీ నేతలు శాంతియుత నిరసన తెలుపుతున్నారు. వందల సంఖ్యలో టీడీపీ నేతలను అనుమతిస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలను నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ప్రపోజల్స్‌ని కూడా నామినేషన్ సెంటర్లకు పోలీసులు వెళ్లనివ్వడం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్


