తల, కాళ్లు చేతులు ఒక ఊరిలో.. మొండెం మరో ఊరిలో.. | Brutally Murdered at Krishna District | Sakshi
Sakshi News home page

తల, కాళ్లు చేతులు ఒక ఊరిలో.. మొండెం మరో ఊరిలో..

Oct 22 2026 10:03 AM | Updated on Oct 22 2026 10:03 AM

Brutally Murdered at Krishna District

కృష్ణా జిల్లా బందరు(మచిలీపట్నం): మండలంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని ముక్కలుగా నరికి మొండెం ఒక ఊరిలో.. కాళ్లు, చేతులు మరో ఊరిలో పడేశారు. వాటిని చూసిన రెండు ఊళ్ల జనం హడలెత్తిపోయారు. వివరాలు.. మచిలీపట్నం మండలం వాడపాలెం పంటకాలువలో బుధవారం గుర్తు తెలియని ఓ వ్యక్తి మొండెంను గ్రామస్తులు గుర్తించారు. తల, కాళ్లు, చేతులు లేకుండా మొండెం ఒక్కటే నీళ్లలో తేలుతూ కనిపించటంతో భయంతో వణికిపోయారు.

 ఊరి పెద్దలు వెంటనే బందరు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే పీటీపాలెం మురుగు కాలువలో తల, కాళ్లు, చేతులు తేలుతూ కనిపించటంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు కూడా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకొని ఆయా భాగాలను స్వాదీనం చేసుకున్నారు. సీఐ యేసుబాబు మృతుడి అవయవాలను మచిలీపట్నం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతునికి 40 ఏళ్ల వయసు ఉంటుందని సీఐ చెప్పారు. హతుడిని గుర్తించేందుకు, హంతకులను పట్టుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement