వైఎస్సార్‌సీపీలో చేరిన గుండా లక్ష్మీదేవి | TDP EX MLA Gunda Lakshidevi Joined In YSRCP In The Presence Of YS Jagan In Tadepalli, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Gunda Lakshmi Devi: వైఎస్సార్‌సీపీలో చేరిన గుండా లక్ష్మీదేవి

Oct 22 2026 11:40 AM | Updated on Oct 22 2026 12:31 PM

TDP EX MLA Gunda Lakshidevi Joined In YSRCP

సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లాలో అధికార టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. టీడీపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి.. టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం, వైఎస్సార్‌సీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గుండా లక్ష్మీదేవి.. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా గుండా లక్ష్మీదేవికి వైఎస్‌ జగన్‌​ పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. 

అనంతరం లక్ష్మీదేవి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్లుగా పనిచేశాం. నా భర్త నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంతో నిబద్ధతతో పనిచేశారు. కానీ నాటి విలువలు, సిద్ధాంతాలు, మంచి విధానాలు ఇప్పుడు ఆ పార్టీలో లేవు. నా భర్త విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకున్నారు. విలువల్లేని టీడీపీలో ఉండలేకే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలేవీ జరగడం లేదు. రైతులకు అవసరమైనవి అందడం లేదు.. ఆస్పత్రుల్లో మందులు లేవు. అనేక రంగాల్లో రాష్ట్రం వెనుకబడిపోతోంది. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా. గతంలో ఏ పార్టీలో ఉన్నా ఎంతో నిబద్ధతతో పనిచేశాం. వైఎస్సార్‌సీపీలోనూ అదే నిబద్ధతతో పనిచేస్తాం. ప్రజల కోసం ఎవరుంటే వారితో ఉండాలనుకున్నాను అని అన్నారు. 

కాగా, గుండా లక్ష్మీదేవి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. ఆమె భర్త, దివంగత మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లక్ష్మీదేవితో పాటుగా ఆమె ముఖ్య అనుచరులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు.

 

టీడీపీ నాయకులు ముద్దాడ ప్రవీణ్, జల్లు రాజీవ్, సిమ్మ నర్సింగరావు, పల్లి శ్రీనివాసరావు, కునుకు గోవింద్, గాడు సాయికుమార్, గేదెల రాంకుమార్, యాగాటి ప్రసాద్, చిన్నాల ముత్తయి నాయుడు, చెట్టు గోవింద్, గురువు శ్రీనివాస్, రౌతు నాగేశ్వరరావు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

 

 

ఇదీ చదవండి: టీడీపీ హింసా కాండ.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement