మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం.. | YSRCP Leader Narayana Swamy Survives Alleged Murder Attempt By TDP Workers While Heading To File ZPTC Nominations In Chittoor | Sakshi
Sakshi News home page

మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం..

Oct 22 2026 11:42 AM | Updated on Oct 22 2026 12:03 PM

Narayana Swamy Attack Allegations Chittoor

చిత్తూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కారును చుట్టుముట్టి దాడికి పాల్పడుతున్న టీడీపీ గూండాలు

సాక్షి, చిత్తూరు: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి తెగబడ్డారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్‌ఆర్‌ పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులతో నామినేషన్లు వేయడానికి బుధవా­రం చిత్తూరు జెడ్పీ కార్యాలయానికి నా­రా­యణస్వామి బయల్దేరారు.

దారిలో మాటువేసిన గంగాధరనెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్, ఆ పార్టీ నేత చిట్టిబాబు నాయుడు, వందలాది మంది టీడీపీ గూండాలు ఇనుప రాడ్లు, రాళ్లతో నారా­యణస్వామిని చంపడానికి ప్రయత్నించారు. కారు తలుపు మూసేయడంతో ఆ­యన తృటిలో ప్రాణాపాయం నుంచి త­ప్పించుకున్నారు.

కారులో ఉన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులను టీడీపీ గూండాలు చావబాదారు. ఓ దశలో పచ్చ­మూకలను నారాయణస్వామి అ­భ్యర్థిస్తూ చేతులెత్తి దండం పెడుతున్నా కనికరించలేదు. డ్రైవర్‌ చాకచక్యంతో కా­రు ముందుకు పోనివ్వడంతో తప్పించు­కున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు­లు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు.

ఇదీ చదవండి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement