ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారు.. | Kalpalatha Reddy Nominations Andhra Pradesh Local Body Elections | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారు..

Oct 22 2026 11:16 AM | Updated on Oct 22 2026 11:21 AM

Kalpalatha Reddy Nominations Andhra Pradesh Local Body Elections

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి

సాక్షి, అమరావతి: ము­న్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకున్నట్లుగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ నామినేషన్ల ప్రక్రియకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు.

ఆమె బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు సహా పదికి పైగా జిల్లాల్లో నామినేషన్లను అడ్డుకోవడం, పత్రాలను చించివేయడం, మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం జరుగుతోందని చెప్పారు.

ఈ దుర్మార్గాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీడీపీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించకపోవడం వల్లే సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎన్నికల సంఘం అమలు చేయకపోతే వైఎస్సార్‌సీపీ మరోసారి న్యాయపోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: చంద్రబాబు అధికారంలో ఉంటే రాజ్యాంగ వ్యవస్థలకు ఆటంకం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement