ఎస్‌ఈసీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేతల ధర్నా | Ysrcp Leaders Protest Near SEC Office | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈసీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేతల ధర్నా

Oct 22 2026 12:52 PM | Updated on Oct 22 2026 1:25 PM

Ysrcp Leaders Protest Near SEC Office

సాక్షి, విజయవాడ: ఎస్‌ఈసీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌సీపీ నేతలకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా అపాయింట్‌మెట్‌ ఇవ్వకపోవడంతో.. ఎస్‌ఈసీ తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు అడ్డుకున్నవారిపై  చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారన్న వైఎస్సార్‌సీపీ నేతలు.. సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండో రోజు కూడా ఎస్‌ఈసీని కలిసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు వచ్చారు. నామినేషన్ల ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలను వివరించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలకు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎస్‌ఈసీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీలో చేరిన గుండా లక్ష్మీదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement