సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జనసేన తరఫున బరిలో నిలిచిన మేకల ఈశ్వర్ చిక్కుల్లో పడ్డారు. పుట్టపర్తి మున్సిపాలిటీతో పాటు ఓబుల దేవర చెరువు (ఓడీ చెరువు) మండలం మల్లాపల్లిలో కూడా ఓటు ఉండటంతో అధికారుల వద్ద లాబీయింగ్ మొదలుపెట్టాడు. తన ఓటును పుట్టపర్తిలో ఆమోదించి.. మల్లాపల్లిలో రద్దు చేయాలని అభ్యర్థించారు. రెండు చోట్ల ఓటు ఎందుకు నమోదు చేయించుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
సర్ (ఎస్‌ఐఆర్) స్రూ్కటినీలో భాగంగా పుట్టపర్తిలో ఓటు తొలగించి ఓడీ చెరువు మండలం మల్లాపల్లిలో ఓటు యథాతథంగా ఉంచాలని మేకల ఈశ్వర్ అభ్యర్థన చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పుట్టపర్తి మున్సిపాలిటీలో ఓటు చూపిస్తూ జనసేన తరఫున చైర్మన్ అభ్యరి్థగా బరిలో దిగారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున కూటమి తరఫున నామినేషన్ వేసిన వారందరూ విత్ డ్రా చేసుకున్న తర్వాత ఈశ్వర్ రెండు ఓట్ల వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఏ నిమిషాన ఏం జరుగుతుందోనని కూటమి నాయకుల్లో గుబులు మొదలైంది.


