Jharkhand Man Strangles Son To Death For Asking For Rs 10 In Chatra District, Details Inside - Sakshi
Sakshi News home page

Jharkhand: రూ.10 అడిగితే ప్రాణం తీశాడు

Jun 13 2023 6:10 AM | Updated on Jun 13 2023 9:37 AM

Jharkhand man strangles son to death for asking for Rs 10 - Sakshi

ఛత్రా(జార్ఖండ్‌): కేవలం రూ.10 అడిగిన కుమారుడి పట్ల తండ్రి కాలయముడైన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఉన్న తండ్రి.. కుమారుడిని ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఛత్రా జిల్లాలోని వశిష్ట్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కరేలీబర్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ గులామ్‌ సర్వర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 48 ఏళ్ల బిలేశ్‌ భుయాన్‌ తన భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు కుమార్‌తో కలిసి జీవిస్తున్నాడు.

సోమవారం ఉదయం తొమ్మిదిగంటలకే భుయాన్, అతని భార్య ఇద్ద రూ పూటుగా తాగి ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. అదే సమయంలో ఓ పది రూపాయలు ఇవ్వు నాన్నా అంటూ బాలుడు పప్పు కోరాడు. అప్పటికే కోపంతో ఉన్న భుయాన్‌ మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. తీవ్ర ఆవేశంతో కుమారుడిని ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అదే సమయానికి ఇటుక బట్టీలో పనిచేసే కూతురు పని ముగించుకుని ఇంటికి వచ్చింది. తమ్ముడి మరణం చూసి పొరుగువారిని కేకలేసి పిలిచింది. విషయం తెల్సుకున్న పోలీసులు వెంటనే తండ్రిని అరెస్ట్‌చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement