AP: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య | Inter Student Incident In Andhra Pradesh's Anantapur | Sakshi
Sakshi News home page

AP: ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

Jun 8 2025 5:52 PM | Updated on Jun 8 2025 8:08 PM

Inter Student Incident In Andhra Pradesh's Anantapur

అనంతపురం: జిల్లాలో దారుణం చోటు చేసకుంది. ఇంటర్‌ చదువుతున్న తన్మయి అనే విద్యార్థిని దారుణంగా హత్య చేయబడింది. కొంతమంది దుండగులు ఇంటర్‌ విద్యార్థినిని తొలుత తలపై బండరాయితో కొట్టి చంపి.. ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఉరవకొండ నియోజవర్గం కూడేర మండలం బ్రహ్మణపల్లి వద్ద మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. 

తమ కుమార్తె కనిపిండం లేదని ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసలు పట్టించుకోలేదని, చివరకు ఇలా పూర్తిగా కాలిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  ఇంటర్‌ చదివే ఆ విద్యార్థినిని హత్య చేసిన తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చివేసినట్ల తెలుస్తోంది. ఆర రోజుల క్రితం అదృశ్యమైనప్పటికీ పోలీసుల కాలయాపన చేయడంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.  

పోలీసులు ముందుగానే పట్టించుకని ఉంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాల్‌లిస్ట్‌ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని ఆ అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బీర్‌ బాటిల్‌తో కొట్టడం వల్లే..
విద్యార్థిని తన్మయిని బీర్‌ బాటిల్‌తో కొట్టడం వల్లే చనిపోయిందని అనంతపురం వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ తెలిపారు. ఈ నెల 3వ తేదీన తన్మయి అదృశ్యం అయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. వంటనే కేసు నమోదు చేసి అనుమానితులను విచారించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు సీఐ రాజేంద్రనాథ్‌.


 

 

 

Advertisement
 
Advertisement
Advertisement