HYD: ఫుల్లుగా తాగి కారు నడిపి.. చెట్టును ఢీ కొట్టి.. | Ghatkesar: Car Accident At Keesara Details & News Updates | Sakshi
Sakshi News home page

ఫుల్లుగా తాగి చెట్టును ఢీ కొట్టిన మైనర్లు.. ఇద్దరి మృతి

Published Sat, Oct 7 2023 10:24 AM | Last Updated on Sat, Oct 7 2023 10:44 AM

Ghatkesar Keesara Car Accident Details News Updates - Sakshi

సాక్షి, మేడ్చల్: వాళ్లు మైనర్లు.. పైగా మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

కీసర చౌరస్తా నుండి యాధ్గార్ పల్లి వైపు వెళ్తున్న బెలీనో కార్  (TS 10 ES 7428) అదుపు తప్పి గోశాల వద్ద చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భువేష్ (17 ), తుషార (18) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్ని అల్వాల్ బొల్లారం ప్రాంతం కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో ఓ యువతి కూడా ఉండడం గమనార్హం.

ప్రమాదానికి గురైన కారు నుంచి మద్యం సీసాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుల్లుగా తాగిన మత్తులో డ్రైవ్‌ చేసే ప్రమాదానికి వాళ్లు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గాయపడిన పిలిప్స్, రుబిన్‌లతో పాటు వాళ్లతో ఉన్న యువతిని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement