వీడు ఓ తండ్రేనా.. ఐదేళ్ల కూతురిపై మారుతండ్రి ఘాతుకం | Father Molested Her Daughter In Karnataka | Sakshi
Sakshi News home page

వీడు ఓ తండ్రేనా.. ఐదేళ్ల కూతురిపై మారుతండ్రి ఘాతుకం

Jan 6 2022 7:51 AM | Updated on Jan 6 2022 7:51 AM

Father Molested Her Daughter In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మైసూరు (కర్ణాటక): ఐదేళ్ల బాలికపై సవతి తండ్రి సయ్యద్‌ ముజీబ్‌ (45) అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇతడు రెండున్నర నెలల క్రితం భార్యతో విడిపోయి ముగ్గురు పిల్లల తల్లిని రెండవ వివాహం చేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఆమె కూతురిపై అత్యాచారం చేశాడు. బుధవారం ఉదయం బాలిక అనారోగ్యానికి గురి కావడంతో విషయం వెలుగు చూసింది. చామరాజనగర ఇన్‌స్పెక్టర్‌ మహదేవశెట్టి నిందితుడిని అరెస్టు చేశారు.  

లైంగికదాడి కేసులో అరెస్టు  
బాగేపల్లి: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ను బాగేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గూళూరు హోబళికి చెందిన 15 ఏళ్ల విద్యార్థినిపై 21 ఏళ్ల ట్రాక్టర్‌ డ్రైవర్‌ అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఫిర్యాదు రావడంతో ఇన్‌స్పెక్టర్‌ డీఆర్‌ నాగరాజు పోక్సో చట్టం కింద అరెస్టుచేసి జైలుకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement