
యూపీలో దివ్యాంగ యువతిపై సామూహిక అత్యాచారం
బలరాంపూర్: ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 21 ఏళ్ల దివ్యాంగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు నివాసముండే ప్రాంతంలోని రహదారిపై ఆమెను వెంబడించి.. కిడ్నాప్ చేసి మరీ దురాగతానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు మూడు, నాలుగు బైక్‌లపై ఆమెను వెంబడిస్తుండటం, యువతి రోడ్డుపై పరుగెత్తుతుండటం ఎస్పీ నివాసంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది.
తన ఇంటినుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తన మామ ఇంటికి వెళ్లిన యువతి.. తిరిగి తన ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. దారిలో బైక్ ఆపిన వ్యక్తి ఆమెను వెంబడించారు. తరువాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అయితే యువతి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెదకడం ప్రారంభించారు. చివరకు ఒక పోలీసు పోస్టు సమీపంలో పొదల్లో అపస్మారక స్థితిలో కనిపించింది. స్పృహలోకి వచి్చన యువతి.. బైక్‌పై వచి్చన వ్యక్తులు అత్యాచారం చేశారని వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు నిందితులు అంకుర్ వర్మ, హర్షిత్ పాండేలను అరెస్టు చేశారు.