మాస్కులో బంగారం.. విమాన ప్రయాణికుడి అరెస్ట్‌ | Customs Officer Gold Seized In Chennai Airport At Tamilnadu | Sakshi
Sakshi News home page

మాస్కులో బంగారం.. విమాన ప్రయాణికుడి అరెస్ట్‌

Apr 3 2021 7:57 AM | Updated on Apr 3 2021 7:57 AM

Customs Officer Gold Seized In Chennai Airport At Tamilnadu - Sakshi

టీ.నగర్‌: ఫేస్‌ మాస్కులో బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికుడిని విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. దుబాయ్‌ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయ్‌ ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం వచ్చింది. ఇందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు జరిపారు. పుదుక్కోటైకు చెందిన మహ్మద్‌ అబ్దుల్లా (40) గ్రీన్‌ చానల్‌ మీదుగా బయటికి వెళ్లాడు. అతనిపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు.

మహ్మద్‌ అబ్దుల్లా ధరించిన ఫేస్‌ మాస్కు తేడాగా ఉండడంతో దానిని విప్పి చూశారు. ఇందులో 85 గ్రాముల బంగారం పేస్టు  అతికించి ఉంది. దీని విలువ రూ.3 లక్షలు. అలాగే అతని బ్యాగ్‌లో ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. వాటి విలువ రూ.8.13 లక్షలు. వాటిని స్వాధీనం చేసుకుని అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: ఎమ్మెల్యే కారులో రూ.2కోట్లు చోరీ 

Advertisement
 
Advertisement
Advertisement