breaking news
seized gold
-
ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు
భువనేశ్వర్: కటక్ సర్కిల్, గనుల డిప్యూటీ డైరెక్టర్‌ను అరెస్టు చేసి అక్రమ ఆర్జన ఆరోపణ కింద రూ. 4.27 కోట్లు విజిలెన్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. విజిలెన్సు చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక నగదు స్వాదీనంగా విజిలెన్సు అధికారులు బుధ వారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కటక్ సర్కిల్, కటక్‌లోని గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మహంతిని రాష్ట్ర విజిలెన్స్ బుధవారం అరెస్టు చేశారు. అనంతరం స్థానిక విజిలెన్స్ విభాగం ప్రత్యేక కోర్టు ప్రవేశ పెట్టారు. అవినీతి నిరోధక (సవరణ) చట్టం, 2018 కింద ఆయన వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి, కటక్ సర్కిల్, కటక్‌లోని గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మహంతిని ఒడిశా విజిలెన్స్ అరెస్టు చేసినట్లు ప్రకటించారు. లైసెన్స్ పొందిన బొగ్గు విక్రేత బొగ్గు డిపో నిర్వహణ, బొగ్గు రవాణాకు అనుమతి ఇవ్వడానికి బదులుగా రూ. 30,000 లంచం గుంజుతుండగా విజిలెన్సు వలలో చిక్కారు. ఒడిశాలోని ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలురూ.30,000 లంచం తీసుకున్నాడని ఆరోపణలతో, కట్టక్ మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి ఇంట్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసే క్రమంలో రూ.4 కోట్ల అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నామని ఇంకా లెక్కింపు… pic.twitter.com/kvfwCzIpQx— Telugu Scribe (@TeluguScribe) February 25, 2026 స్థానిక శ్రీ విహార్, పటియా ప్రాంతం నేచర్స్ క్రెస్ట్ అపార్ట్మెంట్లో నిందితుని అద్దె భవనం, భద్రక్ మఠ సాహిలోని అతని కార్యాలయ ఛాంబర్‌పై ఏకకాలంలో సోదాలు జరిగాయి. విజిలెన్సు అధికారులు నిర్వహించిన సోదాల్లో 305.40 గ్రాముల బంగారు ఆభరణాలు, 600 గ్రాముల వెండి ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. సోదాల సమయంలో అతడి అద్దె భవనంలో ట్రాలీ బ్యాగులు, బీరువాల్లో దాచిపెట్టిన రూ. 4,27,13,600 నగదు బయటపడింది. దీన్ని విజిలెన్సు వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆయన ఆఫీస్ టేబుల్ డ్రాయర్, ఆయన వద్ద నుంచి రూ. 1.20 లక్షల నగదును అదనంగా స్వా«దీనం చేసుకున్నారు. సోదాల సమయంలో స్థానిక పొహలో వద్ద సుమారు 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక 2 అంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు. పెట్టుబడులు, డిపాజిట్లు, బీమా, పొదుపులు తదితర లావాదేవీలుకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ఆర్జనకు మించిన ఆస్తుల గుర్తింపు కోణంలో తదుపరి విచారణ జరుగుతోంది. 1968 మే 7న జన్మించిన దేబబ్రత మహంతి 2004 ఆగస్టు 9న బొలంగీర్‌లోని మైనింగ్ కార్యాలయంలో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ (సీనియర్ సర్వేయర్)గా ప్రభుత్వ సేవలో చేరారు. ఆ తర్వాత ఆయన 2006 నుంచి 2008 వరకు బరిపదలో, 2009 నుంచి 2011 వరకు బరంపురం, 2011 నుంచి 2014 వరకు కటక్, 2014 నుంచి 2018 వరకు భువనేశ్వర్‌లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అదే హోదాలో పని చేశారు. ఆయన మార్చి 2018లో అసిస్టెంట్ మైనింగ్ ఆఫీసర్ (చీఫ్ సర్వేయర్) హోదాకు పదోన్నతి పొంది సంబల్పూర్లో చేరారు. ఏప్రిల్ 2022 నుండి డిసెంబర్ 2025 వరకు ఫుల్బాణిలో మైనింగ్ ఆఫీసర్‌గా ఫుల్బణి, బౌధ్, నయాగఢ్ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. 2026 జనవరి 7న కటక్ సర్కిల్లో కటక్, కేంద్రాపడా జిల్లాల పరిధితో గనుల డిప్యూటీ డైరెక్టర్‌గా చేరి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. -
అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
అమృత్ సర్: శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి 822 గ్రాముల కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భద్రత సిబ్బందిని మోసగించే ప్రయత్నంలో ప్రయాణికుడు తన వద్ద ఉన్న మూడు ప్లాస్టిక్ కవర్లలో క్యాప్సూల్స్ ఆకారంలో బంగారాన్ని దాచిపెట్టాడని అధికారులు తెలిపారు. "ఎయిర్ ఇండియా విమాన నంబర్ 930లో దుబాయ్ నుంచి అమృత్ సర్ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడిపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని ప్రశ్నించినప్పుడు, మూడు క్యాప్సూల్స్ లో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచిపెట్టినట్లు అంగీకరించాడు" అని అమృత్ సర్ లోని కస్టమ్స్ ప్రివెంటివ్ కమీషనేట్ ప్రతినిధి తెలిపారు.స్వాధీనం చేసుకున్న బంగారం విలువ ₹.38లక్షలు అని అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ప్రయాణికుడి పేరును బయటికి వెల్లడించలేదు. ఆగస్టు 24న ఇలాగే, షార్జా నుంచి ఇండిగో విమానంలో విమానాశ్రయంలో దిగిన పురుష ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు ₹.78 లక్షల విలువైన 1.600 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.(చదవండి: మీరు పెట్టిన పెట్టుబడి ఎన్ని ఏళ్లలో రెట్టింపవుతుంది?) -
భారీగా బంగారం, నగదు పట్టివేత
సాక్షి, కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం, నగదును పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల 5లక్షల 35వేల 500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు వ్యక్తుల నుంచి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు, బంగారం సీజ్ చేశారు. ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు తరలిస్తుండగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వాహనాలకు నకిలీ బీమా.. వారే సూత్రధారులు తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం -
తమిళనాడు ఎన్నికలు: గంటల వ్యవధిలో 428 కోట్లు సీజ్
చెన్నై: మరికొద్ది గంటల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) 428 కోట్లు విలువ చేసే బంగారం, నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను సీజ్ చేసింది. ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన రూ. 225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు ముందు 72 గంటలు అత్యంత కీలకమని, ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఈసీ వివరించింది. కాగా, గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా 428 కోట్ల సొత్తు పట్టుబడినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా అక్రమ సొత్తు బయటపడిన నగరాల్లో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై నగరాలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. చదవండి: బాక్సర్ కావాల్సిన కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు.. -
మాస్కులో బంగారం.. విమాన ప్రయాణికుడి అరెస్ట్
టీ.నగర్: ఫేస్ మాస్కులో బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికుడిని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయ్ ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం వచ్చింది. ఇందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. పుదుక్కోటైకు చెందిన మహ్మద్ అబ్దుల్లా (40) గ్రీన్ చానల్ మీదుగా బయటికి వెళ్లాడు. అతనిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు. మహ్మద్ అబ్దుల్లా ధరించిన ఫేస్ మాస్కు తేడాగా ఉండడంతో దానిని విప్పి చూశారు. ఇందులో 85 గ్రాముల బంగారం పేస్టు అతికించి ఉంది. దీని విలువ రూ.3 లక్షలు. అలాగే అతని బ్యాగ్‌లో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. వాటి విలువ రూ.8.13 లక్షలు. వాటిని స్వాధీనం చేసుకుని అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యే కారులో రూ.2కోట్లు చోరీ -
భారీగా బంగారం పట్టివేత..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం భారీగా బంగారం పట్టుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, వారి నుంచి ఎటువంటి పత్రాలు లేని 1,865 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.95,11,500 ఉంటుందని కస్టమ్స్ అదనపు కమిషనర్ నాగేంద్రరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, బంగారం ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. -
‘వందే భారత్ మిషన్’నూ వదల్లేదు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. వందే భారత్ మిషన్ విమానాల్లో వస్తున్న ప్రయాణికుల్లో కొంతమంది అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. దామన్ నుండి వస్తున్న 11 మంది ప్రయాణికులు అధికారులు కన్నుగప్పి లోదుస్తుల్లో బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించారు. వారి నుంచి నుంచి కోటి అరవై లక్షల రూపాయలు విలువైన 3.11 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఈస్ట్‌మారేడుపల్లిలోని షైన్ హాస్పిటల్‌పై దాడులు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు.. నలభై బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఇద్దరు వ్యక్తులు కారులో క్యాలికట్ నుంచి మైసూర్ మీదుగా హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నారు. నిందితుల నుంచి రూ.2కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. -
సీజ్ చేసిన బంగారం తక్కువ ధరకే ఇస్తామని..
♦ రూ.3 లక్షలు, 10 సెల్ఫోన్లు, సుమో స్వాధీనం కోరుట్ల : కస్టమ్స్ అధికారులు సీజ్చేసిన బంగారం తక్కువ ధరకే ఇస్తామని చెప్పి సూట్‌కేసు మాయతో లక్షల్లో డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్న దొంగలముఠా సభ్యులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కోరుట్ల పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టుపడినవారిలో ఒకరు డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఉండడం గమనార్హం. డీఎస్పీ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన వనమాల తిరుపతయ్య గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఓ దొంగతనం కేసులో సస్పెండ్అయ్యాడు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన చెక్క సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా వక్కలంకకు చెందిన బండితి శ్రీనివాస్ కలిసి 20 ఏళ్లుగా బంగారం ఎరగా వేసి మోసాలకు పాల్పడుతున్నారు. తిరుపతయ్య తాను కస్టమ్స్ ఆఫీసర్‌గా తప్పుడు ఐడెంటిటీ కార్డు తయారుచేయించి దాన్ని ఆధారంగా చేసుకుని తమ వద్ద సీజ్ చేసిన బంగారం ఉందని తక్కువ ధరకు అమ్ముతామని చెబుతూ ఫోన్లో సంప్రదిస్తాడు. మొదట స్విస్ దేశపు ముద్ర ఉన్న బంగారు బిళ్లను చూపుతాడు. అదే బంగారం కిలో వరకు ఉందని కేవలం రూ.15–20 లక్షలు ఇస్తే అమ్ముతామని నమ్మబలుకుతారు. వీరి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చిన వారిని సూట్‌కేసుతో మాయ చేస్తారు. వారి డబ్బులు తీసుకుని దర్జాగా పారిపోతారు. సూట్‌కేసు మాయాజాలం ఇలా.. బంగారం కోసం వచ్చినవారి నుంచి డబ్బులు తీసుకునే సమయంలో నిందితులు తమ వద్ద ఉన్న రెండు అరల సూట్‌కేసు తీసుకెళ్లారు. ఈ సూట్‌కేసులోని రెండు అరల్లో ఒకే రీతిలో ఉన్న నల్లటి చిన్నబ్యాగులు ఉంచుతారు. బంగారం కోరిన వారి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులను నల్లబ్యాగులో ఉంచి సూట్‌కేసులో ఓ అరలో ఉంచుతారు. ఆ తరువాత తమ బంగారం మరో వ్యక్తి తెస్తున్నాడని చెబుతారు. కొంతసేపటికి తమ వ్యక్తి బంగారం తేవడంలో అలస్యమవుతోందని, బంగారం ఇవ్వకుండా డబ్బులు తీసుకోమని చెప్పి సూట్‌కేసులో మరో అరలో ఉంచిన తెల్లకాగితాల నోట్లు ఉన్న మరో బ్యాగును తీసి వాపస్ ఇచ్చేస్తారు. సూట్‌కేసులో రెండు అరలు ఉన్న విషయం నల్లబ్యాగు మారిన విషయం గమనించని బాధితులు తమ డబ్బులు తమ వద్దనే ఉన్నాయని భావిస్తారు. ఈలోపు నిందితులు బంగారం తీసుకువస్తామని బయటకు వెళ్లి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి జారుకుంటారు. బంగారం కొనుగోలు చేద్దామనుకున్న వారు వీరు ఎంతకీ రాకపోయే సరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి తమ వద్ద ఉన్న నల్లబ్యాగును తెరిచి అందులో తెల్లనోట్ల కాగితాలు ఉండటంతో లబోదిబోమంటారు. లెక్కలేనన్ని మోసాలు.. తిరుపతయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్ కలిసి ఏడాదిన్నర వ్యవధిలో ఇదే రీతిలో ఐదుగురిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2015 జనవరిలో వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన గంగినేని రాజేందర్ వద్ద రూ.10లక్షలు, 2015 అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని టప్పాచబుత్రాలో ఉండే దయానంద్ వద్ద రూ.11.50 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల మండలం ఎర్రవెల్లికి చెందిన రాధాకృష్ణ వద్ద ఈ ఏడాది మారిచలో రూ.10 లక్షలు, గత నెలలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన సందీప్ అనే వ్యాపారి వద్ద రూ.15 లక్షలు తీసుకుని బంగారం ఇవ్వకుండానే ఉడాయించారు. నెల క్రితం మెట్పల్లి మండలం చింతలపేటకు చెందిన తిరుపతిరెడ్డిని ఉచ్చులోకి లాగేందుకు యత్నించారు. వరంగల్‌కు చెందిన గంగినేని రాజేందర్‌తో వ్యాపార భాగస్వామిగా ఉన్న తిరుపతిరెడ్డి బంగారం విషయమై సలహా అడిగాడు. దీంతో రాజేందర్ తాను ఏడాది క్రితం మోసపోయిన విషయాన్ని వెల్లడించాడు. అప్రమత్తమైన తిరుపతిరెడ్డి వెంటనే కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజుకు సమాచారం ఇచ్చారు. జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్‌రాజు చాకచక్యంగా వలపన్ని నిందితులను పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం పోలీస్ బోర్డు పెట్టుకుని కోరుట్ల శివారు ప్రాంతంలో టాటా సుమోలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాము చేసిన మోసాలు ఒప్పుకున్నారు. వీరిని అరెస్టు చేసి రూ.3లక్షలు నగదు, 3 తులాల స్విస్ బంగారం బిళ్ల, 10 సెల్ఫోన్లు, సూట్‌కేసు, సుమో స్వా«ధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చొరవ చూపిన సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై బాబురావు, ప్రొబేషనరీ ఎస్సై సూరి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, నరేందర్, నరేష్రావును డీఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు.


