హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత | Directorate Of Revenue Officers Captured Huge Gold In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

Nov 23 2019 6:12 PM | Updated on Nov 23 2019 7:45 PM

Directorate Of Revenue Officers Captured Huge Gold In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఈస్ట్‌మారేడుపల్లిలోని షైన్‌ హాస్పిటల్‌పై దాడులు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు.. నలభై బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఇద్దరు వ్యక్తులు కారులో క్యాలికట్‌ నుంచి మైసూర్‌ మీదుగా హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నారు. నిందితుల నుంచి రూ.2కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement