అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Gold worth RS 38 lakh seized at Amritsar airport - Sakshi

అమృత్ సర్: శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని  కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి 822 గ్రాముల కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భద్రత సిబ్బందిని మోసగించే ప్రయత్నంలో ప్రయాణికుడు తన వద్ద ఉన్న మూడు ప్లాస్టిక్ కవర్లలో క్యాప్సూల్స్ ఆకారంలో బంగారాన్ని దాచిపెట్టాడని అధికారులు తెలిపారు.

"ఎయిర్ ఇండియా విమాన నంబర్ 930లో దుబాయ్ నుంచి అమృత్ సర్ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడిపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని ప్రశ్నించినప్పుడు, మూడు క్యాప్సూల్స్ లో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచిపెట్టినట్లు అంగీకరించాడు" అని అమృత్ సర్ లోని కస్టమ్స్ ప్రివెంటివ్ కమీషనేట్ ప్రతినిధి తెలిపారు.స్వాధీనం చేసుకున్న బంగారం విలువ ₹.38లక్షలు అని అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ప్రయాణికుడి పేరును బయటికి వెల్లడించలేదు. ఆగస్టు 24న ఇలాగే, షార్జా నుంచి ఇండిగో విమానంలో విమానాశ్రయంలో దిగిన పురుష ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు ₹.78 లక్షల విలువైన 1.600 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.(చదవండి: మీరు పెట్టిన పెట్టుబడి ఎన్ని ఏళ్లలో రెట్టింపవుతుంది?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top