Guntur : పీకల వాగులో పడి బాలుడు మృతి | Boy Washed Out In Guntur Pikala Vagu | Sakshi
Sakshi News home page

Guntur : పీకల వాగులో పడి బాలుడు మృతి

Jun 27 2021 10:16 AM | Updated on Jun 27 2021 10:54 AM

Boy Washed Out In Guntur Pikala Vagu - Sakshi

సాక్షి, గుంటూరు : నగరంలో విషాదం చోటుచేసుకుంది. వాగులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. శనివారం గుంటూరు నగరంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వర్షం తగ్గిన తర్వాత మృతుడు వెంకటేష్‌తో పాటు మరో బాలుడు ఆడుకోవటానికి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ ప్రమాదవశాత్తు పీకల వాగులో పడి, కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.12 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత బాలుడి శవాన్ని కనుగొన్నారు. వంతెన కింద బాబు మృత దేహాన్ని గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement