స్నేహం పేరుతో నమ్మించి.. బాలికపై అత్యాచారం.. సింగర్‌ అరెస్ట్‌

Bhojpuri singer arrested in Gurugram - Sakshi

పాట్నా: నమ్మి వచ్చిన పాపానికి ఓ బాలికపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫోటోల‌ను నెట్టింట పోస్టు చేసి చివరికి అరెస్ట్‌ అయ్యాడు భోజ్‌పురి గాయ‌కుడు. నిందితుడిని బీహార్‌కు చెందిన 21 ఏళ్ల అభిషేక్‌గా గుర్తించారు. అత‌ని యూట్యూబ్ ఛాన‌ల్‌లో 27వేల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం అభిషేక్‌ రాజీవ్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అభిషేక్‌కు ఓ బాలికతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అయితే స్నేహం నెపంతో బాలికను హోటల్ గదిలోకి రప్పించాడు. అతని నిజం స్వరూపం తెలియని బాలిక రూంలోకి వెళ్లగానే.. ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు పలు అసభ్యకర ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత బాలిక నిందితుడికి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం నిందితుడు బాలిక ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు చూసిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. దీంతో తనపై జరిగిన ఆఘాయిత్యాన్ని తల్లిదండ్రులతో పంచుకుంది. బాలిక వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు ప్రతినిధి సుభాష్ బోకెన్  తెలిపారు. అనంతరం అతడిని సిటీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

చదవండి: HYD: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top