లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు | Bengaluru Police Arrested Former Minister Hd Revanna | Sakshi
Sakshi News home page

లైంగిక ఆరోపణల కేసు.. హెచ్‌డి రేవణ్ణ అరెస్టు

May 4 2024 7:21 PM | Updated on May 4 2024 8:49 PM

Bengaluru Police Arrested Former Minister Hd Revanna

బెంగళూరు: మహిళ కిడ్నాప్‌, లైంగిక ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణను బెంగళూరు పోలీసులు శనివారం(మే4) అరెస్టు చేశారు. రేవణ్ణ తన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. 

కిడ్నాప్‌ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని రేవణ్ణ వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలోనే పోలీసులు రేవణ్ణను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల వేళ సంచలనం రేపిన  సెక్స్‌ వీడియోల స్కాం​డల్‌ కేసులో కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణతో పాటు రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్నారు. కాగా, ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈయనపై సెక్స్‌ స్కాండల్‌  కేసులో పోలీసులు ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement