Another Begging Mafia Busted Hyd Trans Get UP, Bihar Men Arrested - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: నకిలీ ట్రాన్స్‌జెండర్ల ముఠా.. సంచలన విషయాలు వెల్లడించిన డీసీపీ చందన దీప్తి

Aug 19 2023 2:06 PM | Updated on Aug 19 2023 4:53 PM

Another Begging Mafia Busted Hyd Trans Get Up Bihar Men Arrested - Sakshi

ట్రాన్స్‌జెండర్‌లలాగా వేషాలు వేసుకుని పగలు డబ్బులు గుంజుతూ.. 

సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్ల వేషంలో బెగ్గింగ్‌ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ ముఠాకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు వెస్ట్‌జోన్‌ డీసీపీ చందన దీప్తి. వీళ్లంతా బీహార్‌కు చెందిన వాళ్లని, ఇలాంటి వాళ్లు వంద మందిదాకా ఉన్నారని ఆమె తెలిపారు.  

రాజేష్‌, అనితలు ఈ ముఠా నాయకులు. రాజేష్‌ దగ్గర 100 దాకా సభ్యులు ఉన్నారు. వీళ్లంతా పగలంతా ట్రాన్స్‌జెండర్‌ల వేషంలో ఉంటూ జనం దగ్గరి నుంచి డబ్బులు గుంజుతుంటారు. సాయంత్రం కాలనీలు, కమర్షియల్‌ ఏరియాల్లో దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈజీ మనీ కోసమే వాళ్లు ఈ గ్యాంగ్‌ను నడిపిస్తున్నారు అని డీసీపీ చందన దీప్తి తెలిపారు. ఈ ముఠాలో మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారామె. 

పగలంతా ప్రజలను బెదిరిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు గుంజుతున్న ఈ నకిలీ ట్రాన్స్‌జెండర్ల గురించి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, జూబ్లీహిల్స్‌ స్టేషన్‌ ప్రాంతంలో వీళ్లు హంగామా చేస్తున్నట్లు గుర్తించారు.  ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement