వాడు దీపును చంపాడు.. మాకు అప్పగించండి | BIG Twist In Anakapalle Transgender Dipu Case | Sakshi
Sakshi News home page

Anakapalle: వాడు దీపును చంపాడు.. మాకు అప్పగించండి

Mar 19 2025 11:00 AM | Updated on Mar 19 2025 1:45 PM

BIG Twist In Anakapalle Transgender Dipu Case

అనకాపల్లి, సాక్షి: జిల్లాలోని కశింకోట మండలం బయ్యవరంలో మర్డర్‌ మిస్టరీ వీడింది. ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రియుడే అతికిరాతకంగా హతమార్చిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోతున్న హిజ్రాలు పీఎస్‌ వద్ద ఆందోళనకు దిగారు. తమ స్నేహితురాలిని ముక్కలు చేసిన నిందితుడిని అప్పగించాలంటూనాందోళన చేపట్టారు.

దీపు అనే ట్రాన్స్‌జెండర్‌ను ఆమె ప్రియుడు బన్నీ దారుణంగా హతమార్చాడు. ఆ శరీర భాగాలను వేరు చేసి బెడ్‌షీట్‌లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశాడు. ఈ ఘోరం స్థానికంగా కలకలం రేపింది. శరీర భాగాలను సేకరించిన పోలీసులు.. చివరకు  మృతదేహం నాగులపల్లికి చెందిన దిలీప్‌ అలియాస్‌ దీపు అనే హిజ్రాగా గుర్తించారు. అనంతరం ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. బన్నీతో రీకన్‌స్ట్రక్షన్‌ చేయిస్తున్న పోలీసులు.. హత్యకు గల కారణాలను  ఆరా తీస్తున్నారు. 

వాడిని అప్పగించండి
తమ స్నేహితురాలిని అతికిరాతకంగా చంపిన హంతకుడిని తమకు అప్పగించాలంటూ హిజ్రాలు పీఎస్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అయ్యో.. పాపం
కశింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు మందుల మధ్య ఖాళీ స్థలం దొరికిన ఒక మూటలో మొల దిగువ భాగం కాళ్లు, ఒక చేయి ఉన్నాయి.. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మూట విప్పి.. ఆ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. సుమారు 30 ఏళ్ల వయసు.. చేతికి గాజులు.. కాలికి మట్టెలు.. ఉండడంతో ఆమె వివాహిత అని తొలుత అంతా పొరపడ్డారు.  అయితే విచారణలో ఆమె దీపు అనే ట్రాన్స్‌జెండర్‌గా తేలింది. 

8 ప్రత్యేక బృందాల ఏర్పాటు  
ఈ హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ చెప్పారు. అనకాపల్లి ఎస్పీ సెలవులో ఉండటంతో.. విజయనగరం ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. సంఘటన స్థలాన్ని, ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన శరీర భాగాలను కూడా ఆయన పరిశీలించారు. 

అనకాపల్లిలో మహిళ దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement