
అనకాపల్లి: అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమె రెండు కాళ్లు, రెండు చేతులను నరికి చంపేశారు. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు.
అయితే బెడ్ షీట్ అనుమానాస్పదంగా రక్తంతో ఉండటంతో స్థానికంగా దాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బెడ్ షీట్ ను ఓపెన్ చేసి చూడగా ఓ మహిళకు చెందిన రెండు కాళ్లు, రెండు చేతులు అందులో ఉండటం చూసి షాక్ అయ్యారు. దాంతో స్థానికంగా కలకలం రేగింది. అసలు హత్యకు గురైంది ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు?, హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.