ఘోర రోడ్డు ప్రమాదం.. అంతా మదనపల్లి వాసులే! | 14 Deceased In Road Accident At Kurnool | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. అంతా మదనపల్లి వాసులే!

Feb 14 2021 6:06 AM | Updated on Feb 14 2021 8:25 PM

14 Deceased In Road Accident At Kurnool - Sakshi

మృతుల్లో ఓ చిన్నారితో పాటు, 8 మంది మహిళలు ఉన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: కర్నూలు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో- లారీ ఢీ కొన్న ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యాస్మిన్, ఆస్మా, కాశీం(10), ముస్తాక్‌ (12)ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. టెంపో వాహనం నుజ్జునుజ్జు కావడంతో మృత దేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి.

పోలీసులు క్రేన్‌ సాయంతో టెంపో వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్‌కార్డులు, ఫోన్‌ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్‌లోని బాలాజీ నగర్‌కు చెందిన రఫీ, జాఫర్, దస్తగిరి కుటుంబాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మదనపల్లి నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు.  

ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు.. 
నజీరాబి(65), దస్తగిరి(50), అమ్మాజాన్‌(46), సమీరా(16), అమీరూన్‌(15), రఫి(36), మస్తానీ(30), రయాన్‌(1), జాఫర్‌ వలి(32), రోషిణి(25), నౌజియా(34), అమీర్‌జాన్‌(63), డ్రైవర్‌ నజీర్‌(55), మెకానిక్‌ షఫి(38).

చదవండి: కర్నూలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి 

Advertisement
 
Advertisement
Advertisement