పల్లెపోరులో పన్నాగాలు | - | Sakshi
Sakshi News home page

పల్లెపోరులో పన్నాగాలు

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

నామినేషన్ల పర్వం నుంచే కుట్రలకు ప్రణాళిక అధికార పార్టీ బలంగా ఉండే ప్రాంతాల్లోనే సెంటర్ల ఏర్పాటు

చిత్తూరు కార్పొరేషన్‌: పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లో రాజకీయ వేడి మొదలైంది. ఆదివారం తొలి విడత నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అందులో భాగంగా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని అభ్యర్థులు నామినేషన్‌ వేయనున్నారు. అయితే పచ్చమూక ముందస్తుగానే బెదిరింపులు, ఒత్తిళ్లు, ఏకగ్రీవాలకు తెగబడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. పురపాలక, పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు సర్పంచ్‌ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు అధికార కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు కుట్రపూరితంగా పోలీసుల సాయంతో ఏకగ్రీవాలు చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచాం. ప్రతిపక్షం బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటామని, కాదని నామినేషన్లు వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిసేత వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఆధిపత్యం సాధిస్తారనే భయంతోనే పన్నాగాలు పన్నుతున్నారని తెలుస్తోంది.

ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేనా?

ఈ నేపథ్యంలో అభ్యర్థులకు భద్రత కల్పించడం, నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు ప్రతి దశను నిష్పక్షపాతంగా నిర్వహించడం ఎన్నికల యంత్రాంగం ప్రధాన కర్తవ్యం. గ్రామీణ ప్రజాస్వామ్యానికి పునాదులైన పంచాయతీ ఎన్నికలు ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్వేచ్చగా పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులది. అయితే ఈ సారి జరిగే సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోటీ బరిలో నిలుస్తారా..?ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటారా..?అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం గ్రామాల్లో ఇదే చర్చ సాగుతోంది. ప్రతిపక్ష అభ్యర్థి పేరు ఖరారు కాగానే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు.

కూటమి

బలంగా ఉన్న

గ్రామాల్లోనే..

కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాలలో టీడీపీ బలంగా ఉన్న చోటే నామినేషన్‌ కేంద్రాలను పెట్టారు. అలాగే గుడిపాలలో పేయనిపల్లె, 197 రామాపురం, ఎఎల్‌పురం, నగరిలో అడవికొత్తూరు. వీఆర్‌కేపురం, నిండ్ర మండలంలో కొప్పేడు, ఎలకత్తూరు, నిండ్ర, నెట్టేరి, ఆరూరు, విజయపురంలో జగన్నాథపురం, ఐరాల మండలంలో మద్దిపట్లపల్లె, ఇరువారంపల్లె, పెనుమూరు మండలంలో పెనుమూరు, స్వామిరెడ్డిపల్లె, యాదమరి మండలంలో పత్రపల్లె, కాశిరాల, యాదమరి, కోనపల్లె, 14 కండ్రిగ, 12 కమ్మపల్లె, పూతలపట్టు మండలంలో పి.కొత్తకోట, తేనేపల్లె, తలుపునేనివారిపల్లె, కార్వేటినగరం మండలంలో అన్నూరు. డీఎం పురం ప్రాంతాలున్నాయి. వీటితో పాటు జిల్లాలోని మిగిలిన మండలాల్లోను కూటమి బలంగా ఉండే ప్రాంతాలను నామినేషన్‌ కేంద్రాలుగా ఎంపిక చేశారు. జిల్లాలోని మొత్తం 27 మండలాల్లో 147 నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement